Rachakonda Police Commissioner who provided financial assistance to the family members of policemen who died due to illness.

భారత్ న్యూస్ హైదరాబాద్,

అనారోగ్యంతో చనిపోయిన పోలీసుల కుటుంబ సభ్యులకు ఆర్దిక సహాయం అందచేసిన రాచకొండ పోలీసు కమిషనర్.

  ఈరోజు రాచకొండ పోలీసు కమిషనరేట్ కార్యాలయం (నేరేడ్ మెట్) నందు  శ్రీ డి.యస్. చౌహాన్, ఐపిఎస్., రాచకొండ పోలీసు కమిషనర్ గారు అనారోగ్యంతో మరిణించిన కీసర పోలీస్ స్టేషన్  కానిస్టేబుల్ శ్రీనివాస్ కుటుంబ సభ్యులకు భద్రత నుండి 6,80,951=00 రూపాయల  చెక్కులు (బార్య స్వాతి కు 2,80,951/-, మైనర్ పిల్లలు భవిక కు 2 లక్షలు, రియన్ష్ కు 2 లక్షలు), నారాయణ్ పూర్ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ అశోక్ కుటుంబ సభ్యులకు భద్రత నుండి 7,39,100/-  రూపాయలు చెక్కులు (బార్య సుధారాణి కి 3,39,100/-, మైనర్ పిల్లలకు జ్ఞాపిక కు 2 లక్షలు,  జినత్ కు 2 లక్షలు  మరియు మల్కాజ్గిరి కానిస్టేబుల్ వినోద్ కుమార్ కుటుంబ సభ్యులకు భద్రత నుండి 7,92,440/-  (తండ్రి బిక్షపతి కి 3,96,220/, తల్లి మనెమ్మ కు 3,96,220/-)  ఇవ్వడం జరిగింది. వీరికి  పెన్షన్, ఉద్యోగం త్వరగా వచ్చే విదంగా చర్యలు తీసుకోవాలని రాచకొండ సి‌పి గారు సంబంధిత అదికారులను ఆదేశించారు.
       ఈ కార్యక్రమములో  అడిషనల్ డి‌సి‌పి అడ్మిన్ వి. శ్రీనివాస్ రెడ్డి, పోలీసు అధికారుల సంఘం అధ్యక్షులు సి‌హెచ్. భద్రా రెడ్డి మరియు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.