169th Divisional Railway Users Consultative Committee Meeting under Secunderabad Division

భారత్ న్యూస్ హైదరాబాద్,

సికింద్రాబాద్ డివిజన్ ఆధ్వర్యంలో 169 వ డివిజనల్ రైల్వే వినియోగదారుల సంప్రదింపుల కమిటీ సమావేశం

డివిజనల్ రైల్వే యూజర్స్ కన్సల్టేటివ్ కమిటీ (డిఆర్‌యుసిసి), సికింద్రాబాద్ డివిజన్ సమావేశం 08 డిసెంబర్ 2023 న సికింద్రాబాద్ లోని సంచాలన్ భవన్ లో జరిగింది.. ఈ సమావేశానికి సికింద్రాబాద్ డివిజన్ డివిజనల్ రైల్వే మేనేజర్ శ్రీ భరతేష్ కుమార్ జైన్ అధ్యక్షత వహించారు. డిఆర్‌యుసి కమిటీలో మొత్తంగా 13 మంది సభ్యులకుగాను , 6 మంది సభ్యులు సమావేశానికి హాజరయ్యారు.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నవంబర్, 2023 వరకు సికింద్రాబాద్ డివిజన్ సాధించిన విజయాలను మరియు సికింద్రాబాద్ డివిజన్ ద్వారా చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాల గురించి శ్రీ భరతేష్ కుమార్ జైన్ సభ్యులకు వివరించారు. అంతేకాకుండా, ప్రయాణీకుల సౌకర్యాలకు సంబందించిన పనులు మరియు పురోగతిలో ఉన్న వివిధ ప్రాజెక్టుల అభివృద్ధి గురించి సభ్యులకు వివరించారు.
డివిజన్‌లో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల పట్ల కమిటీ సభ్యులు సంతృప్తి వ్యక్తం చేస్తూ పలు పనులు పూర్తి చేసేందుకు డివిజన్‌ చేస్తున్న కృషిని అభినందించారు. అనంతరం సభ్యులు పంపిన ప్రధాన డిమాండ్లు ఆయిన వివిధ రైళ్లకు అదనపు స్టాప్ ల ఏర్పాటు, ప్రయాణికుల సౌకర్యాలైన లిఫ్టులు, ఎస్కలేటర్లు ఏర్పాటు మరియు రైళ్ల సమయపాలన, స్టేషన్లు మరియు రైళ్లలో పరిశుభ్రత వంటి అంశాలపై చర్చించారు .
సభ్యుల సూచనలు/అభ్యర్ధనలను మార్గదర్శకాలు/నిబంధనలకు అనుగుణంగా పరిశీలించి తదనుగుణంగా చర్యలు తీసుకుంటామని చైర్మన్ హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ శ్రీ ఎం. బసవరాజ్ మరియు ఇతర బ్రాంచ్ అధికారులు పాల్గొన్నారు.