Having won as the MLA of Kothagudem, he became the voice of the

భారత్ న్యూస్ హైదరాబాద్,

కొత్తగూడెం ఎమ్మెల్యేగా గెలుపొందిన తాను , కమ్యూనిస్టు గొంతుకగా, అన్ని కమ్యూనిస్టు పార్టీల ప్రతినిధిగా ఉంటాన‌ని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివ రావు అన్నారు. అనేక మంది మేథావులను అణచివేస్తూ వారిపై నమోదు చేస్తున్న అక్రమ కేసులు,ఉపా చట్టాలకు వ్యతిరేకంగా తన గొంతు వినిపిస్తానని, ప్రగతిశీల శక్తుల తరపున నిలబడుతానిని హామీనిచ్చారు. అణచివేతను అంగీకరించబోమని శాసనసభ ఎన్నికల్లో ప్రజలు రుజువు చేశారన్నారు. సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ, కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్ రెడ్డి, జాతీయ సమితి సభ్యులు పల్లా వెంకట్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఈ.టి.నర్సింహతో కలిసి హైదరాబాద్ మగ్ధుం భవన్ మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ తెలంగాణ అస్తిత్వమే నిర్బంధాలు, అణచివేతలు, నిరంకుశత్వానికి వ్యతిరేకమని, నిజాం నవాబు కృర రాచరీక పాలనకు వ్యతిరేకంగా కమ్యూనిస్టు పార్టీ రైతాంగ సాయుధ పోరాటాన్ని చేపట్టి తెలంగాణను విముక్తి చేసిందని గుర్తు చేశారు. రాష్ర్టంలో నాటి పరంపార కొనసాగుతోందన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు నిర్బందకాలం ఉన్నప్పటికీ స్వేచ్ఛ ఉండేదని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన పదేళ్ల కాలంలో స్వేచ్ఛ లేదని విమర్శించారు. బాధను కూడా వ్యక్తం చేయలేని పరిస్థితి, ఊపిరి ఆడనివ్వకుండా నిర్భందాలతో ఉండేద‌ని ఆవేదన వ్యక్తం చేశారు. ఆందోళనకు దిగితే ముందస్తు అరెస్టులు జరిగేవని, బంగారు తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చిన వాగ్ధానాల్లో ఒక్కటీ అమలు కాలేదని విమర్శించారు.
నిధులు కెసిఆర్ సొంతమయ్యాయని, నియమకాల్లో పిల్లలకు నియామకాలు లేవని, కానీ రాజకీయ నియామకాలుమాత్రం జరిగాయన్నారు. నిర్బంధాలను అంగీకరించబోమని ప్రజా తీర్పు స్పష్టమైందన్నారు. అధికారం శాశ్వితమనుకుని నిర్భాందాలకు పాల్పడితే ప్రజలు సహించబోరనేందుకు ప్రస్తుతం జరిగిన ఎన్నికలే ఒక సంకేతమన్నారు. కాంగ్రెస్ పార్టీని ప్రజలు విశ్వసించారని, పదేళ్ల కాలంలో ఏం చేయని సిఎం, ఇప్పుడు మాత్రం ఏం చేస్తారని ప్ర‌జ‌లు ఆలోచించార‌ని అన్నారు.
ఎన్నికల పొత్తు అంశంలో తమ పట్ల సిపిఐ(ఎం) హుందాగా వ్యవహారించిందని, ఆ పార్టీ నాయకులు త‌మ విజ‌యానికి బాగా కష్టపడ్డారని కూనంనేని సాంబశివరావు ప్రశంసించారు. కాంగ్రెస్, సిపిఐ పొందిక బాగా కలిసొచ్చిందని, కమ్యూనిస్టులు ఎటువైపు ఉంటే, అటు వైపు అధికారం వచ్చే అవకాశం ఉంటుందనేది స్పష్టమైందన్నారు. ఖమ్మం, నల్లగొండ, ఇబ్రంహీంపట్నంలో కమ్యూనిస్టలు ప్రభావం ఉన్నదని, కమ్యూనిస్టులు, కాంగ్రెస్ కలువడంతో వాతావరణం కలిసిరావడంతో అదనపు ఓట్లు వస్తాయన్నారు. కోల్డ్ బెల్టులో కరీంనగర్, చాలా చోట్ల కమ్యూనిస్టు ప్రభావం ఉన్నదని, తమ మద్దతు ఉపయో గపడిందన్నారు. సమాజాన్ని ప్రభావితం చేయడంలో కమ్యూనిస్టు గొప్ప శక్తివంతమైన పాత్రను పోషించలగరన్నారు. కొత్తగూడెం ఎమ్మెల్యేగా త‌న‌ను భారీ మెజార్జీతో గెలిపించినందుకు అందరూ హర్శీస్తున్నారన్నారు. తన విజయానికి కృషి చేసిన కాంగ్రెస్, సిపిఐ(ఎం),సిపిఐ ఎం.ఎల్.టిడిపి, టిజెఎస్,వై.ఎస్ ప్రగతిశీల శక్తులకు, ఓటర్లకు కృతజ్ఙతలు తెలిపారు. తనను పోటీకి దింపిన సిపిఐ జాతీయ రాష్ట్ర పార్టీకి కృతజ్ఞతలు తెలియజేశారు.

మంత్రివర్గంలో చేరాలని ప్రతిపాదిస్తే ఆలోచిస్తాం: నారాయణ
మంత్రివర్గంలో చేరాలని కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదిస్తే ఆలోచన చేసి నిర్ణయం తీసుకుంటామని డాక్టర్ కె.నారాయణ అన్నారు. టూరిజం అడ్మినిస్ట్రేటివ్ కార్యాలయం జరిగిన అగ్నిప్రమాదంపైన జ్యూషియల్ విచారణచేపట్టి, బాధ్యుల‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం మారిన నేపథ్యంలో వందల కోట్ల రూపాయలు దుర్వినియోగం బయటపడుతుందని భావించి విలువైన దస్త్రాలను తగుబెట్టారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అందరినీ కలుపుకుని, విశాలదృక్పథంతో ముందుకెళ్తే, రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్ ఇటువంటి వాతావరణం లేదన్నారు. తెలంగాణ తరహా రాజస్థాన్,మద్యప్రదేశ్ యవతను ప్రొత్సహించలేదని, ఎవరినీ కలుపుకుని పోకుండా ఓంటేద్దు పొకడగా వ్యవహారించిందని విమర్శించారు. చత్తీస్ ఏడు నియోజకర్గాల్లో కమ్యూనిస్టు పార్టీ ప్రభావం చూపే అవకాశం ఉన్నప్పటికీ అక్కడా సీట్ల కేటాయింపు సక్రమంగా జరగలేదన్నారు. తెలంగాణ మినహా మిగత రాష్ట్రాల్లో కాంగ్రెస్ సంకుతిచ వైఖరిని ప్రదర్శించిందన్నారు. విశాలదృక్ఫథం లేకపోవడంతోనే అవకాశం ఉన్నప్పటికీ ఓటమి తప్పలేదన్నారు. ఇండియా కూటమి బలపడాలని, దేశంలో బిజెపి ప్రమాదకరమని, వ్యవస్థలను నాశనం చేస్తుందని విమిర్శించారు. రాజ్యాంగానికి బిజెపి తీవ్రవాదంతోనే ప్రమాదకమని విమర్శించారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికైనా పొరపాటులును గుర్తించాలని సూచించారు. కేంద…