CMR – Customs should take action against millers who are selling milled rice illegally in the market without giving it to the government

భారత్ న్యూస్ హైదరాబాద్,

సీఎంఆర్ – కస్టమ్స్ మిల్లింగ్ బియ్యాన్ని ప్రభుత్వానికి ఇవ్వకుండా అక్రమంగా మార్కెట్లో అమ్ముకుంటున్న మిల్లర్లపై చర్యలు తీసుకోవాలి
సూర్యపేట జిల్లాలో దాదాపు 1000 కోట్ల సీ ఎం ఆర్ బియ్యాన్ని సకాలంలో ప్రభుత్వానికి ఇవ్వకుండా మార్కెట్లో మిల్లర్లు అమ్ముకుంటున్న విషయం వెలుగులోకి వచ్చింది.
ఈ మిల్లర్లకు ప్రభుత్వ అధికారుల అండదండలు పుష్కలంగా ఉన్నాయి.
సివిల్ సప్లై కార్పొరేషన్కు 56 వేల కోట్లు అప్పు ఉందని దాదాపు 11 వేల కోట్ల రూపాయలు నష్టాల ఊబిలో ఉందని అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మంత్రివర్యులు ఉత్తంకుమార్ రెడ్డి గారు వెల్లడించారు.
18 వేల కోట్ల రూపాయల ధాన్యం మిల్లర్ల వద్ద ఉందని పేర్కొన్నారు. సూర్యాపేట జిల్లాలో మిల్లర్లు మార్కెట్లో అక్రమంగా అమ్ముకుంటున్న దానిపై చర్యలు తీసుకోవాలని
విచారణకు కమిటీని ఏర్పాటు చేయాలని దోషులుగా తేలిన మిల్లర్ల లైసెన్స్ రద్దు చేయాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం డిమాండ్ చేస్తుంది.
రేపు 24 .12 .2023న కలెక్టర్ల సమావేశంలో ధరణి, మహాలక్ష్మి పలు అంశాలపై చర్చ చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రుణమాఫీ వెంటనే చేయడానికి చర్యలు తీసుకోవాలని, ఇటీవల భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటలకు నష్ట పరిహారం ఇవ్వాలని, రైతుబంధు నిర్ణీత సమయంలో అమలు చేయాలని, పంటల బీమా పథకాన్ని రాష్ట్రస్థాయిలో అమలు చేయటానికి చర్యలు తీసుకోవాలని, పంటల బీమా పథకం అమలులో రైతు సంఘాల ప్రతినిధులను రైతులను జిల్లా మండల స్థాయి కమిటీలలో అధికారులతో పాటు భాగస్వామ్యం చేయాలని,ప్రతి రైతుకు మద్దతు ధరలు అందే విధంగా ధాన్యం కొనుగోలు చేయాలని,
ధరణిపోర్టల్లో లోపాలను వెంటనే సరిదిద్ది భూ సమస్యలను పరిష్కరించటం తో పాటు టైటిల్ గ్యారెంటీ యాక్ట్ ను తీసుకురావాలని, కోరుతున్నాం.
భాగం హేమంతరావు
రాష్ట్ర అధ్యక్షులు.
పశ్య పద్మ,
ప్రధాన కార్యదర్శి
తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం
9490952276.