…భారత్ న్యూస్ హైదరాబాద్….సంగారెడ్డి నుండి పాకిస్థాన్ కు పకడ్బందీ సమాచారాలు ఇస్తున్న ఉగ్రవాది వీడే.
వీడి పని కేవలం ఇక్కడున్న యువకులను ఉగ్రవాదులుగా తయారు చేయడమే..

NIA దగ్గర కీలక సమాచారం.. కేంద్ర ఇంటలిజెన్సీ బలగాల హెచ్చరికతో అప్రమత్తమైన అస్సాం పోలీసులు వీడిని కొండాపూర్,గొల్లపల్లిలో అదుపులోకి తీసుకోవడం జరిగింది..
సామాన్య కూలీ మేస్త్రిగా జీవనం సాగిస్తున్నట్లు నటన..
ఉగ్రవాదులకు సహకరిస్తున్న సంగారెడ్డి (D) కొండాపూర్ (M) గొల్లపల్లికి చెందిన మోఫిజుల్ ఇస్లాం(19)ను అస్సోం పోలీసులు అరెస్ట్ చేశారు. మేస్త్రిగా పనిచేస్తున్న ఇస్లాం నకిలీ సిమ్ కార్డులను సేకరించి విక్రయిస్తున్నట్లు సమాచారం. దేశానికి చెందిన సిమ్ కార్డులతో OTPలు చెప్పి పాకిస్థాన్లో వాట్సప్ అకౌంట్లు క్రియేట్ చేసేవాడని పోలీసులు గుర్తించారు. ఉగ్రవాదానికి జిల్లాకు లింకులు ఉండడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.