2026-27 విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్ చదువుతున్న ఎస్సీ విద్యార్థులకు ముఖ్య సూచన

భారత్ న్యూస్ గుంటూరు…2026-27 విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్ చదువుతున్న ఎస్సీ విద్యార్థులకు ముఖ్య సూచన

Ammiraju Udaya Shankar.sharma News Editor…ప్రభుత్వం “తల్లికి వందనం” పథకం కింద ఆర్థిక సహాయాన్ని రాబోయే వారం రోజుల వ్యవధిలో విడుదల చేసే అవకాశం ఉన్నందున, అర్హులైన విద్యార్థులు తమ పేరుపై బ్యాంకు ఖాతా ప్రారంభించడం, ఆధార్ సీడింగ్ మరియు NPCI లింకింగ్ ప్రక్రియలను అత్యంత త్వరగా పూర్తి చేసుకోవాలని సూచించడమైనది.

2026-27 విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం మరియు రెండవ సంవత్సరం చదువుతున్న ఎస్సీ విద్యార్థులందరూ ప్రభుత్వం అమలు చేస్తున్న “తల్లికి వందనం” పథకం ప్రయోజనాలు పొందేందుకు తప్పనిసరిగా తమ పేరుపై బ్యాంకు ఖాతా కలిగి ఉండాలి.

ఇప్పటివరకు బ్యాంకు ఖాతా లేని విద్యార్థులు వెంటనే సమీపంలోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, పోస్టాఫీస్ లేదా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) శాఖలను సంప్రదించి తమ పేరుపై బ్యాంకు ఖాతాను ప్రారంభించుకోవాలి.

అదేవిధంగా, ఖాతా ప్రారంభించిన అనంతరం ఆధార్ సీడింగ్ (Aadhaar Seeding) మరియు NPCI లింకింగ్ ప్రక్రియలను కూడా పూర్తి చేయాలి. బ్యాంకు ఖాతా మరియు NPCI మ్యాపింగ్ పూర్తయిన విద్యార్థులకు మాత్రమే “తల్లికి వందనం” పథకం కింద ఆర్థిక ప్రయోజనాలు నేరుగా జమ చేయబడతాయి.

అందువల్ల, కృష్ణా జిల్లాలోని ఇంటర్మీడియట్ చదువుతున్న ఎస్సీ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మరియు సంబంధిత కళాశాల యాజమాన్యాలు ఈ విషయాన్ని అత్యవసరంగా పరిగణించి వెంటనే అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరడమైనది.

ఈ మేరకు షేక్ షాహిద్ బాబు, డిప్యూటీ డైరెక్టర్, సాంఘిక సంక్షేమ శాఖ, కృష్ణా జిల్లా ఒక ప్రకటనలో తెలిపారు.

షేక్ షాహిద్ బాబు
డిప్యూటీ డైరెక్టర్
సాంఘిక సంక్షేమ శాఖ
కృష్ణా జిల్లా