లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సర్వేయర్లు!

భారత్ న్యూస్ వరంగల్ …లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సర్వేయర్లు!

కరీంనగర్ జిల్లా:

భూమి కొలతలు చేసీ నివేదిక ఇచ్చేందుకు లంచం తీసుకున్న మండల సర్వేయర్‌ ఏ,కుమారస్వామి, అతనితో పాటు ఇద్దరు ప్రైవేట్ సర్వేర్లు తీగల రాజేష్,వంగ వినీత్ రెడ్డి, విడతలవారీగా బాధితుడు నుండి 25 వేలు లంచం తీసుకుంటుండగా శుక్రవారం ఏసీబీ అధి కారులు రెడ్ హ్యండెడ్‌ గా పట్టుకున్నారు.

కరీంనగర్‌ జిల్లా సైదాపూర్‌ మండలం అమ్మన్‌గుర్తి గ్రామానికి చెందిన బాధితుడు తన భూమికి సంబం ధించిన సర్వే చేయా లని సంప్రదించగా గత మే నెల నుంచి రెండు విడతలుగా మండల సర్వేయర్లు లంచం తీసుకున్నారని, మూ డో విడుతగా శుక్రవా రం 25 వేలు లంచం తీసుకుంటుండగా బాధితుడి ఫిర్యాదు మేరకు ముగ్గురిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకు న్నామని, అధికారులు తెలిపారు. ముగ్గురిపై కేసు నమోదు చేసి కరీంనగర్‌ ఏసీబీ కోర్టు ఎదుట హాజరు పరిచా మని ఏసీబీ డీఎస్పీ విజయ్ కుమార్, వివరించారు.