హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో రూ. 1,000 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని పరిరక్షించిన హైడ్రా..

భారత్ న్యూస్ హైదరాబాద్ …హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో రూ. 1,000 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని పరిరక్షించిన హైడ్రా..

రెవెన్యూ శాఖ ఫిర్యాదు మేరకు స్పందించిన హైడ్రా వెంటనే రంగంలోకి దిగింది..

కొండాపూర్ హైటెక్స్ సమీపంలోని ఖానమెట్ పరిధిలో సర్వే నంబర్ 42లో ఉన్న 5 ఎకరాల ప్రభుత్వ భూమిలో అక్రమంగా నిర్మించిన షెడ్లు, ఒక గది మరియు కంచెను తొలగించింది.

భూమి చుట్టూ కంచెను ఏర్పాటు చేసిన హైడ్రా అధికారులు ప్రభుత్వ భూమి అని ప్రకటిస్తూ బోర్డు ఏర్పాటు చేశారు..