పార్టీ జాతీయ అధ్యక్షుడిని ప్రకటించిన ప్రశాంత్ కిషోర్

భారత్ న్యూస్ ఢిల్లీ…..పార్టీ జాతీయ అధ్యక్షుడిని ప్రకటించిన ప్రశాంత్ కిషోర్

రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్.. జన్ సూరజ్ పార్టీ స్థాపించిన విషయం తెలిసిందే. అయితే ఆ పార్టీకి తొలి జాతీయ అధ్యక్షుడిగా బీజేపీ మాజీ ఎంపీ ఉదయ్ సింగ్ పేరును ఇవాళ ప్రశాంత్ కిషోర్ ప్రకటించారు. జన సూరజ్ కమిటీలో ఉన్న 150 మంది సభ్యులు ఏకగ్రీవంగా ఉదయ్ సింగ్ను పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నుకున్నట్లు ప్రశాంత్ కిషోర్ తెలిపారు.