నీట్ యూజీ రీటెస్ట్.. ప్రశ్నాపత్రాల తరలింపుపై కీలక నిర్ణయం.. రంగంలోకి ఎయిర్‌‌ఫోర్స్

భారత్ న్యూస్ విశాఖపట్నం..నీట్ యూజీ రీటెస్ట్.. ప్రశ్నాపత్రాల తరలింపుపై కీలక నిర్ణయం.. రంగంలోకి ఎయిర్‌‌ఫోర్స్

నీట్ పేపర్ లీకేజీ దేశవ్యాప్తంగా కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. పేపర్ లీక్‌పై కేంద్ర ప్రభుత్వం అన్నివైపుల నుంచి విమర్శల్ని ఎదుర్కొంది. ఈ నేపథ్యంలో మళ్లీ జరగబోయే నీట్ యూజీ రీటెస్ట్ నిర్వహణలో ఎలాంటి పొరపాట్లు జరగకూడదని నిర్ణయం తీసుకుంది. దీనిలో భాగంగా వచ్చే నెలలో జరిగే పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది.

ప్రశ్నాపత్రాల తరలింపు కోసం ఏకంగా ఇండియన్ ఎయిర్‌‌ఫోర్స్‌నే దించాలని భావిస్తోంది. దీనికి సంబంధించిన సాధ్యాసాధ్యాలపై గురువారం కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ ఢిల్లీలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.