రాజస్థాన్‌లో ఇసుక తుపాను

భారత్ న్యూస్ అనంతపురం..రాజస్థాన్‌లో ఇసుక తుపాను

రాజస్థాన్‌లోని చురు జిల్లాలో శనివారం ఆకస్మికంగా వాతావరణం మారిపోయి ఇసుక తుఫాను బీభత్సం సృష్టించింది. ఈ తుఫానుతో పాటు భారీ వర్షం కూడా కురవడంతో స్థానిక ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారు. ఒక్కసారిగా చుట్టుముట్టిన ఇసుక తుఫాను, బలమైన గాలుల కారణంగా ఈ ప్రాంత ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతూ తీవ్ర ఆందోళనకు గురయ్యారు.