CBSE మార్కుల్లో అవకతవకలు …ఓఎస్‌ఎం వివాదానికి బాధ్యత నాదే.. కేంద్ర విద్యాశాఖ మంత్రి

భారత్ న్యూస్ ఢిల్లీ…..CBSE మార్కుల్లో అవకతవకలు …ఓఎస్‌ఎం వివాదానికి బాధ్యత నాదే.. కేంద్ర విద్యాశాఖ మంత్రి

సీబీఎస్‌ఈ ఆన్‌ స్క్రీన్‌ మార్కింగ్‌(ఓఎస్‌ఎం) వివాదంపై కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ఎట్టకేలకు స్పందించారు. ఓఎస్‌ఎం వివాదానికి పూర్తి బాధ్యత తనదేనన్నారు. ఇందులో అవకతవకలు జరిగినట్టు నిరూపితం అయితే ఎవరినీ వదిలిపెట్టేది లేదని హామీ ఇచ్చారు.

‘పూర్తి బాధ్యత నాదే. సమస్యకు పరిష్కారం వెతుకుతున్నాం, అందరం దాని మీదే పనిచేస్తున్నాం’ అని అన్నారు. సీబీఎస్‌ఈ పరీక్ష రాసిన 17 లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన 98 లక్షల ఆన్సర్‌ షీట్లు భద్రపరిచామని స్పష్టం చేశారు. విద్యార్థులు, పేరెంట్స్‌ నుంచి పెద్ద ఎత్తున కంప్లయింట్స్‌ రావడంతో ఆయన ఈ విధంగా స్పందించారు. సీబీఎస్‌ఈ తొలిసారి ఆన్‌ స్క్రీన్‌ మార్కింగ్‌ విధానాన్ని అమలు చేసింది.