హైడ్రాలో ట్రాన్స్‌జెండర్లకు ఉద్యోగాలు

భారత్ న్యూస్ హైదరాబాద్…హైడ్రాలో ట్రాన్స్‌జెండర్లకు ఉద్యోగాలు

ట్రాన్స్‌జెండర్లంటే ఒకప్పుడు హేళన.. కానీ ఇప్పుడు యూనిఫాంలో పబ్లిక్ ప్రాపర్టీని కాపాడే సింగంలు. 2017లోనే ప్రతిపాదనలకొచ్చిన ఈ ఆలోచన ఇన్నాళ్లకు నిజమై, వారి జీవితాల్లో కొత్త వెలుగులు నింపింది. హైడ్రా ‘ఈగల్ టీమ్’ పేరుతో 16 మంది ట్రాన్స్‌జెండర్లు అక్రమ కట్టడాల కూల్చివేతలు, ప్రభుత్వ భూముల రక్షణలో దుమ్ములేపుతున్నారు. ఈదులకుంట, అమీన్‌పూర్ ఆపరేషన్లలో వీరు చూపిన సహనం, ధైర్యానికి అధికారులు ఫిదా అవుతున్నారు..