..భారత్ న్యూస్ అమరావతి..విద్యాశాఖ మంత్రి లోకేశ్ గారు..
DSC విషయంలో లక్షలాది మంది అభ్యర్థులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. మానసిక వేదనకు గురవుతున్నారు. రేపటి నుంచి పరీక్షలు నిర్వహించడం కరెక్ట్ కాదంటున్నారు. నోటిఫికేషన్, పరీక్ష సమయానికి మధ్య 45 రోజులు మాత్రమే గడువు ఇవ్వడం సబబేనా అని ప్రశ్నిస్తున్నారు. ఇది మెగా DSC కాదు దగా DSC అని వాపోతున్నారు. కనీసం 90 రోజులు ప్రిపరేషన్ గడువు ఉండాలని, 45 రోజుల్లో సిలబస్ మొత్తం చదవలేమని, మూడున్నర లక్షల మంది DSC అభ్యర్థుల పట్ల కనికరం చూపాలని, లేఖల మీద లేఖలు మీకు రాస్తుంటే, కనికరించకపోవడం, నిరుద్యోగుల మొరను పెడచెవిన పెట్టడం అంటే కూటమి ప్రభుత్వ నియంత పోకడకు నిదర్శనం. పైగా డీఎస్సీ వాయిదా వేయాలని చూసే రాజకీయ కుట్రగా మీరు మాట్లాడటం మీ తొందర పాటు నిర్ణయానికి అద్ధం పడుతుంది.

కాంగ్రెస్ పార్టీ పక్షాన కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. DSC నిర్వహణలో పరీక్ష రాసే అభ్యర్థుల డిమాండ్లను పరిగణనలోకి తీసుకోవాలి. 90 పాఠ్య పుస్తకాలను 45 రోజుల్లో ఎలా చదవగలరో అర్థం చేసుకోవాలి. ప్రిపరేషన్ గడువును మరో 45 రోజులు పెంచే అంశంపై వెంటనే పరిశీలన చేయాలి. నార్మలైజేషన్ పద్ధతిలో కాకుండా DSC పరీక్షలు ఒకటే జిల్లా.. ఒకటే పేపర్ విధానంలో ఉంటే బాగుంటుందనే అభ్యర్థుల వాదనపై పునరాలోచన చేయాలని కోరుతున్నాం.
వైఎస్ షర్మిల