భారత్ న్యూస్ తిరుపతి…శ్రీశైలంలో 4 రోజుల పాటు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
శ్రీశైలం :
ఏపీలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో నేటి (శుక్రవారం) నుంచి సోమవారం వరకు వీఐపీ బ్రేక్ (స్పర్శ) దర్శనాలను నిలిపివేస్తున్నట్లు ఆలయ ఈవో ప్రకటించారు. వేసవి సెలవులు, వారాంతపు (వీకెండ్) సెలవుల కారణంగా భక్తుల రద్దీ విపరీతంగా పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. సాధారణ భక్తులకు ఇబ్బంది కలగకుండా కేవలం స్వామివారి అలంకార దర్శనానికి మాత్రమే అనుమతి ఇస్తున్నట్లు తెలిపారు. ముందుగానే టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు మాత్రం యథావిధిగా దర్శనం ఉంటుందని తెలిపారు.
