భారత్ న్యూస్ శ్రీకాకుళం….HDFC బ్యాంక్ చేసిన ‘చట్టబద్ధమైన మోసం’ (Corporate Scams Explained)
మీరు బ్యాంకు సేవింగ్స్ అకౌంట్‌లో డబ్బు పెడితే వచ్చే వడ్డీ ఎంత? కేవలం 3.5%.
కానీ, అదే మహారాష్ట్ర రోడ్ డెవలప్‌మెంట్ కార్పరేషన్ (MSRDC) పెడితే వచ్చిన వడ్డీ 6.1%!
అంటే, మనకన్నా ఆ ప్రభుత్వ సంస్థకు 2.6% ఎక్కువ.
ఈ తేడా ఎందుకు? ఇక్కడే అసలు కార్పొరేట్ డ్రామా మొదలైంది!
స్పాన్సర్‌షిప్ ముసుగులో వడ్డీ!
HDFC బ్యాంక్ ఆ అదనపు 2.6% ని నేరుగా వడ్డీ రూపంలో చెల్లించలేదు. ఎందుకంటే అలా చేస్తే దొరికిపోతారు. అందుకే ఒక కొత్త దారి వెతికారు:
- నలుగురు ప్రైవేట్ వెండర్స్ (Vendors) ను రంగంలోకి దించారు.
- వారి ద్వారా రోడ్ సేఫ్టీ స్పాన్సర్‌షిప్ పేరిట ఏకంగా ₹45 కోట్లు MSRDC కి చేర్చారు.
- బ్యాంక్ అకౌంట్ బుక్స్‌లో దీనిని ‘మార్కెటింగ్ ఖర్చు’ (Marketing Expense) గా చూపించారు.
కానీ నిజానికి అది వడ్డీ! చట్టం దృష్టిలో ఇది Disguised Interest” (నిజమైన వడ్డీని దాచి, వేరే రూపంలో ఇవ్వడం).
RBI రూల్ ఏం చెప్తోంది?
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నిబంధన చాలా స్పష్టంగా ఉంది: “బ్యాంకులు డిపాజిటర్లందరికీ ఒకే వడ్డీ రేటు ఇవ్వాలి.”
ఒక్క పెద్ద సంస్థ కోసం బ్యాక్ డోర్ (Back-door) లో అదనపు డబ్బులు చెల్లించడం నిబంధనల ఉల్లంఘనే. చట్టం మీరు ‘ఏం చేశారు’ అని చూస్తుంది తప్ప, ‘ఎందుకు చేశారు’ అనే కారణాలను పట్టించుకోదు.
“ప్రభుత్వ సంస్థకే వెళ్ళింది కదా, తప్పేముంది?”
ఇది చాలా మందికి వచ్చే అనుమానం. కానీ ఇక్కడే మూడు పెద్ద లూప్‌హోల్స్ (Loopholes) ఉన్నాయి:
డబ్బు వృధా: మధ్యలో ఉన్న వెండర్స్ ఏజెన్సీ ఫీజు, GST, TDS రూపంలో కొట్టేశారు. అంటే ఆ ₹45 కోట్లు పూర్తిగా ప్రభుత్వానికి చేరలేదు.
అవినీతి అనుమానాలు: ఆ వెండర్లను ఎవరు సెలెక్ట్ చేశారు? ఏ ప్రాతిపదికన చేశారు? ఈ ప్రాసెస్‌లో ఎవరికైనా పర్సనల్ కమిషన్లు వెళ్ళాయా? ఇప్పుడు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ (Express Investigation) లీక్ చేసింది సరిగ్గా ఇదే!

డేంజర్ ట్రెండ్: ఈ మోడల్ కనుక సక్సెస్ అయితే, రేపు ప్రైవేట్ కంపెనీలకు, పొలిటిషియన్లకు కూడా ఇదే రూట్‌లో బ్యాంకులు అదనపు వడ్డీలు ఇస్తాయి. అప్పుడు సామాన్యుడికి రక్షణ ఉండదు