మూత్రాశయంలో 1.3 కిలోల రాయి.. డాక్టర్లే షాకయ్యారు!

భారత్ న్యూస్ వరంగల్ …మూత్రాశయంలో 1.3 కిలోల రాయి.. డాక్టర్లే షాకయ్యారు!

కిడ్నీల్లో సాధారణంగా చిన్న రాళ్లు రవ్వంత సైజులో ఉండటం చూస్తుంటాం. కానీ చైనాకు చెందిన రైతు చెన్కు(56) విచిత్రమైన పరిస్థితి ఎదురైంది. మూత్రం వచ్చేటప్పుడు భరించలేని నొప్పితో అతడు మూడేళ్లు నరకం అనుభవించాడు. నొప్పి తీవ్రమవడంతో ఆసుపత్రికి తీసుకెళ్లగా పరీక్షల్లో అతడి మూత్రాశయంలో భారీ రాయి ఉన్నట్లు తేలింది. డాక్టర్లు ఆపరేషన్ చేసి 1.3 కిలోల బరువున్న రాయిని తొలగించారు.