మరో ప్రాణ ప్రతిష్ఠకు ముస్తాబైన రామ మందిరం ….

భారత్ న్యూస్ ఢిల్లీ…..మరో ప్రాణ ప్రతిష్ఠకు ముస్తాబైన రామ మందిరం ….

అయోధ్య రామమందిరం మరో ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి సిద్ధమవుతోంది. మూడు రోజుల పాటు కొనసాగనున్న రామ దర్బార్ ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. ప్రధాన దేవాలయంతో పాటు, లక్ష్మణుడు, హనుమాన్, శివలింగం, గణేశ్, సూర్య దేవుడు, భాగవతీ దేవీ, అన్నపూర్ణ, శేషావతారం విగ్రహాలతో మొత్తం 8 ఉప ఆలయాలు నిర్మించారు. ఈ విగ్రహాల్లోకి ప్రాణ ప్రతిష్ఠ జరిపేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆలయం అంతా విద్యుత్ వెలుగుల్లో మెరిసిపోతూ భక్తులను ఆకర్షిస్తోంది…..