భారత్ న్యూస్ తిరుపతి…తిరుమలలో అక్షయ తృతీయ సందడి..
₹1.10 కోట్ల విలువైన డాలర్ల విక్రయం!
తిరుమల :
ఏపీలో అక్షయ తృతీయను పురస్కరించుకుని తిరుమలలో శ్రీవారి బంగారు, వెండి డాలర్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. ఆది, సోమవారాల్లో భక్తులు వరుసకట్టి దాదాపు 31.10 కోట్ల విలువైన డాలర్లను కొనుగోలు చేశారు. బంగారం ధరలు ఆకాశాన్నంటినా, అక్షయ తృతీయ గడియల్లో స్వామివారి డాలర్లు కొనుగోలు చేయడం శుభప్రదమని భక్తులు మొగ్గుచూపారు. గతేడాది 790 లక్షల విక్రయాలు జరగగా, ఈసారి ఆ రికార్డును అధిగమించడం విశేషం.
