ప్రేమ పేరుతో మోసం.. యువతిపై లైంగిక దాడి కేసులో యువకుడు అరెస్టు

భారత్ న్యూస్ విజయవాడ…ప్రేమ పేరుతో మోసం.. యువతిపై లైంగిక దాడి కేసులో యువకుడు అరెస్టు

ప్రేమిస్తున్నానని నమ్మించి యువతిపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో నిందితుడిని గీసుగొండ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. సీఐ విశ్వేశ్వర్ తెలిపిన వివరాల ప్రకారం మనుగొండ గ్రామానికి చెందిన తుప్పరి ఉదయ్ శంకర్(29) బాధిత యువతితో పదో తరగతి నుంచి పరిచయం పెంచుకుని ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. అనంతరం బెదిరింపులకు గురిచేస్తూ బలవంతంగా శారీరకంగా కలిశాడు. వివాహం గురించి అడగ్గా ఫొటోలు సోషల్ మీడియాలో పెడతానని, కుటుంబ సభ్యులను చంపుతానని బెదిరించాడు.ఏప్రిల్ 24న రాత్రి నిందితుడు బాధితురాలి ఇంట్లో అక్రమంగా ప్రవేశించగా స్థానికులు పట్టుకుని ప్రశ్నించారు. ఆమెను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని నిందితుడు చెప్పాడు. మరుసటి రోజు బాధితురాలి కుటుంబ సభ్యులు, గ్రామ పెద్దలు నిందితుడి ఇంటికి వెళ్లి మాట్లాడగా నిందితుడు, అతడి తండ్రి సమ్మయ్య, అక్క అన్నపూర్ణ కలిసి దూషించి బెదిరించారు. బాధితురాలి ఫిర్యాదుతో గీసుగొండ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న నిందితుడు ఉదయ్ శంకర్‌ను మంగళవారం సాయంత్రం ఊకల్లు క్రాస్ వద్ద