ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించిన బండి భగీరత్?

భారత్ న్యూస్ హైదరాబాద్…ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించిన బండి భగీరత్?

హైదరాబాద్:మే 12
కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరత్, ఫోక్సో కేసులో కీలక పరిణా మం చోటుచేసుకుంది, పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో నమో దైన ఫోక్సో కేసులో మధ్యంతర బెయిల్ కోసం బండి భగీరథ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై హైకోర్టు మే 14న విచారణ చేపట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం.దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది..

ఇక ఈ కేసు విచారణ కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,బండి భగీరథ్ కేసుపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చెయ్యాలని డీజీపీ సీవీ ఆనంద్ కు ఆదేశాలు జారీ చేశారు. ఈ కేసు సున్నితమైనది కావడంతో మహిళా ఐపీఎస్ అధికారిణి కూకట్ పల్లి డీసీపీ రితిరాజ్, పర్యవేక్షణ లో దర్యాప్తు కొనసాగించాలని డీజీపీ నిర్ణయించారు.

ఇప్పటికే బాధితురాలి స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేయడం జరిగింది. సిట్ ఏర్పాటు నేపథ్యంలో మరోసారి స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేసే అవకాశం ఉంది. మరోవైపు బండి భగీ రథ్ కోసం పోలీసుల గాలింపు కొనసాగు తోంది. ఈ కేసుకు సంబంధించి అన్ని ఆధారాలను సేకరిస్తు న్నామని, నేరం రుజువైతే నిందితుడిని కచ్చితంగా అరెస్ట్ చేస్తామని డీసీపీ రితిరాజ్ స్పష్టం చేశారు.