పిఎస్ఎల్ వీ సీ 61 రాకెట్ లాంచ్!

భారత్ న్యూస్ విశాఖపట్నం..భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం ఇస్రో మరో కీలక ప్రయోగానికి సిద్ధమైంది. శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి రేపు ఉదయం 6 గంటల 59 నిమిషాలకు పీఎస్ ఎల్ వీ సీ61 రాకెట్ ను ప్రయోగించనుంది. షార్ లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి రాకెట్ ను లాంచ్ చేయనున్నారు.

అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ రాకెట్ ను రూపొందించారు. 1696 కిలోల రీశాట్ 1 బీ ని నిర్దేశి త కక్ష్యలోని ప్రవేశపెట్టను న్నారు.ఇస్రోకు ఇది 101వ రాకెట్‌ ప్రయోగం. దీని ద్వారా భూ పరిశీలన ఉపగ్రహం (EOS‌) రీశాట్‌-1బీను కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు.

ఈ ఉపగ్రహం ఎలాంటి వాతావరణ పరిస్థితు ల్లోనైనా.. రాత్రి పగలు అనే తేడా లేకుండా.. భూమి ఉపరితలాన్ని స్పష్టంగా చిత్రీకరించగలదు. సాధారణంగా ఆప్టికల్ కెమెరా ఆధారిత ఉపగ్రహాలు ప్రతికూల వాతావరణంలో లేదా రాత్రి సమయాల్లో ఫోటోలను స్పష్టంగా చిత్రీకరించలేవు.

రీశాట్ 1 బీ మాత్రం వర్షం పడుతున్నా, దట్టమైన పొగ మంచు ఉన్నా, మేఘాలు అడ్డుగా ఉన్నా, లేదా చిమ్మచీకట్లు ఉన్నా సరే.. భూ ఉపరితలాన్ని హై రెజల్యూషన్ తో చిత్రీకరిస్తుంది. ఈ విధంగా ఈ ఉపగ్రహాన్ని ఇస్రో సైంటిస్టులు డిజైన్ చేశారు.

ముఖ్యంగా దేశ రక్షణ ప్రయోజనాలకు ఈ రీశాట్ 1బీ రాడార్ సాంకేతికత చాలా కీలకం. రక్షణ రంగా నికి కీలక ముందడుగుగా దీన్ని శాస్త్రవేత్తలు భావిస్తు న్నారు. ఇది నిరంతరాయ నిఘా నేత్రంలా పని చేస్తుంది.

పాకిస్తాన్, చైనా వంటి దేశాలతో ఉన్న సరిహద్దు ప్రాంతాలను పర్యవేక్షించ డంలోనూ, అలాగే దేశ విశాలమైన తీర ప్రాంతాన్ని కాపాడటంలోనూ రక్షణ రంగానికి సహకారం అందించడంలో ఉపయోగపడుతుంది.

శత్రువుల కదలికలు పసిగట్టడం, చొరబాట్లను గుర్తించడం, ఉగ్రవాద కార్యకలాపాలపై నిరంతరాయంగా ఒక విశ్వసనీయమైన నిఘా సమాచారాన్ని అందిం చేందుకు ఈ ఉపగ్రహం మన సైంటిస్టులకు ఎంతగానో ఉపయోగప డనుంది.