భారత్ న్యూస్ విజయవాడ…ఇక పై ఏపీ స్థానిక ఎన్నికల్లో ఈ-సేవలు!
విజయవాడ :
ఏపీ రాష్ట్రంలో స్థానికసంస్థల ఎన్నికల నిర్వహణ ఇక సులభతరం కానుంది. ఈ ప్రక్రియను ఎలక్ట్రానిక్ ఫార్మెట్లోకి తీసుకొస్తున్నారు. ‘సెంటర్ ఫరుడ్ గవర్నెన్స్’ ఆధ్వర్యంలో ఇందుకు సంబంధించిన సాఫ్ట్వేర్, మొబైల్ అప్లికేషన్ల తయారీ చివరిదశకు చేరింది. ఓటర్ల జాబితాలు, నామినేషన్ల దాఖలు, ఉపసంహరణ, పోలింగ్ నిర్వహణ, ఎన్నికల ఫలితాలవరకు ఎలక్ట్రానిక్సేవలు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. తద్వారా ఎన్నికల నిర్వహణలో మానవ జోక్యం తగ్గుతుందని రాష్ట్రఎన్నికలసంఘం భావిస్తోంది.
