భారత్ న్యూస్ అమరావతి..అమరావతి :
ఏపీలో మున్సిపల్ కార్మికుల సమ్మె…!
ఏపీ రాష్ట్రవ్యాప్తంగా 48,000 మంది మున్సిపల్ కార్మికులు నేడు (మంగళవారం) సమ్మెకు పిలుపునిచ్చారు.
వేతనాలు ఆలస్యం కావడం వల్ల తమ కుటుంబాలను పోషించుకోవడం కష్టంగా మారిందని కార్మిక సంఘాలు ఆవేదన వ్యక్తం చేశాయి.
ఈ నిరసన కారణంగా రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో చెత్త సేకరణ, మురుగునీటి పారుదల పనులు నేడు స్తంభించిపోయే అవకాశం ఉంది.
ప్రభుత్వం చర్చలకు వచ్చి ఒక పరిష్కారం కనుగొనే వరకు తాము విధులకు హాజరుకాబోమని కార్మికులు చెబుతున్నారు.

కొంతమంది కావాలని యూనియన్ నాయకులు రెచ్చగొడుతున్నారని సమాచారం.