భారత్ న్యూస్ రాజమండ్రి…డిజిటల్ వేదికగా ‘మహానాడు’.. విజయవంతం చేయాలని కనపర్తి శ్రీనివాసరావు పిలుపు
అవనిగడ్డ: అవనిగడ్డ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బుధవారం మహానాడు సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అవనిగడ్డ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ పరిశీలకులు కనపర్తి శ్రీనివాసరావు మాట్లాడుతూ మే 27,28 వ తేదీలలో తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన మహానాడు వేడుకలను డిజిటల్ వేదికల ద్వారా ఘనంగా జరుపుకుంటున్నట్లు ప్రకటించారు.సాంకేతికత సహాయంతో ప్రతి కార్యకర్తను నేరుగా అనుసంధానించేలా ఒక వినూత్న ప్రయత్నానికి పార్టీ శ్రీకారం చుట్టిందని తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన పొదుపు ఆశయాలకు అనుగుణంగా, ఇంధన పొదుపు దిశగా అంతర్జాతీయ చమురు సంక్షోభం మరియు రవాణా ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ముందస్తు చర్యగా ఈ డిజిటల్ మహానాడు నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వివరించారు. అవనిగడ్డ నియోజకవర్గ పరిధిలోని అన్ని క్లస్టర్ల పరిధిలో మహానాడును అత్యంత ఘనంగా నిర్వహించాలని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.మహానాడును అఖండ విజయవంతం చేద్దాం అని కనపర్తి శ్రీనివాసరావు ఈ సందర్భంగా పార్టీ శ్రేణులకు, నాయకులకు మరియు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో దివి మార్కెట్ కమిటీ చైర్మన్ కొల్లూరి వెంకటేశ్వరరావు,మోపిదేవి మండల పార్టీ అధ్యక్షులు నడకుదిటి జనార్దనరావు,అవనిగడ్డ మండల పార్టీ అధ్యక్షులు యాసం చిట్టిబాబు,కోడూరు మండల పార్టీ అధ్యక్షులు బండే శ్రీనివాసరావు,నాగాయలంక మండల పార్టీ అధ్యక్షులు మెండు లక్ష్మణరావు ,కృష్ణాజిల్లా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి రావి రత్నగిరి,జిల్లా పార్టీ కార్యదర్శి అవనిగడ్డ ప్రకాశం,నియోజకవర్గ పరిధిలోని క్లస్టర్ ఇంచార్జిలు,తదితర పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు
