భారత్ న్యూస్ రాజమండ్రి….వారికి మ్యారేజ్ సర్టిఫికెట్ అవసరం లేదు: మంత్రి నాదెండ్ల మనోహర్
అమరావతి :
ఏపీలో మంత్రి నాదెండ్ల మనోహర్ రేషన్ కార్డు దారులకు గుడ్ న్యూస్ చెప్పారు. రాష్ట్రంలో వాట్సాప్ గవర్నెన్స్ మనమిత్ర(95523 00009)లో రేషన్ కార్డుల సేవలు అందనున్నాయి. అయితే, పెళ్లైన వారు పాత రేషన్ కార్డు నుంచి విడిపోయి కొత్తదానికి అప్లై చేసుకోవడానికి మ్యారేజ్ సర్టిఫికెట్ అవసరం లేదని మంత్రి స్పష్టం చేశారు. వాట్సాప్ లో రైస్ కార్డుల జారీ, కార్డుల విభజన, అడ్రస్ మార్పు, కుటుంబ సభ్యుల చేర్పులు, తొలగింపులు, కార్డుల సరెండర్ వంటి సేవలు అందుతాయిని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.
