ఏపీలో మరో ఘోర ప్రమాదం.. పూర్తిగా కాలిపోయిన కావేరి ట్రావెల్స్ బస్సు

భారత్ న్యూస్ రాజమండ్రి…ఏపీలో మరో ఘోర ప్రమాదం.. పూర్తిగా కాలిపోయిన కావేరి ట్రావెల్స్ బస్సు

హైదరాబాద్ నుంచి తిరుపతి వెళుతున్న కావేరి ట్రావెల్స్ బస్సు

ప్రకాశం జిల్లా రాజుపాలెం వద్ద ఇంజిన్‌లో చెలరేగిన మంటలు

డ్రైవర్ అప్రమత్తతతో క్షేమంగా బయటపడిన ప్రయాణికులు

ఆంధ్రప్రదేశ్‌లో వరుసగా చోటుచేసుకుంటున్న బస్సు ప్రమాదాలు ప్రయాణికులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా ప్రకాశం జిల్లా రాజుపాలెం వద్ద కావేరి ట్రావెల్స్ బస్సులో అగ్నిప్రమాదం సంభవించింది. హైదరాబాద్ నుండి తిరుపతి వెళ్తున్న ఈ బస్సు ఇంజిన్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగడాన్ని గమనించిన డ్రైవర్, అప్రమత్తమై బస్సును వెంటనే నిలిపివేశారు. ఆ సమయంలో బస్సులో సుమారు 36 మంది ప్రయాణికులు ఉండగా, మంటలు వ్యాపించకముందే వారంతా సురక్షితంగా కిందకు దిగడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రయాణికులందరూ క్షేమంగా బయటపడటంతో అధికారులు, బంధువులు ఊపిరిపీల్చుకున్నారు.