తమిళనాడులో 21 ఏళ్ల లోపు వారికి మద్యం విక్రయంపై నిషేధం !

భారత్ న్యూస్ గుంటూరు…తమిళనాడులో 21 ఏళ్ల లోపు వారికి మద్యం విక్రయంపై నిషేధం !
యువత భవిష్యత్తు కోసం విజయ్ సర్కార్ కఠిన నిర్ణయం తీసుకున్నది.
విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే తమిళనాడులో మద్యం నియంత్రణపై కీలక నిర్ణయం తీసుకున్నారు. 21 ఏళ్ల లోపు వారికి మద్యం విక్రయాలపై కఠిన నిషేధం అమలు చేస్తూ ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ముఖ్య నిర్ణయాలు ఇవే:

Ammiraju Udaya Shankar.sharma News Editor… మద్యం కొనుగోలు, సేవించడానికి కనీస వయస్సు 21 సంవత్సరాలు తప్పనిసరి.
🔹 Tamil Nadu State Marketing Corporation దుకాణాల్లో 21 ఏళ్ల లోపు వారికి మద్యం విక్రయించరాదని స్పష్టమైన ఆదేశాలు.
🔹 వయస్సుపై అనుమానం ఉంటే ఆధార్ కార్డ్ వంటి గుర్తింపు పత్రాలు తప్పనిసరిగా పరిశీలించాలి.
🔹 పాఠశాలలు, కళాశాలలు, ప్రార్థనా స్థలాల సమీపంలో ఉన్న 717 TASMAC దుకాణాలను మూసివేయాలని నిర్ణయం.
🔹 నిబంధనలు ఉల్లంఘించిన దుకాణాలపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరిక.
యువతను మద్యం వ్యసనానికి దూరంగా ఉంచడం, విద్యార్థుల భవిష్యత్తును కాపాడడం, సమాజంలో ఆరోగ్యకరమైన వాతావరణం సృష్టించడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం చెబుతోంది.
ఈ నిర్ణయం ఇతర రాష్ట్రాలకు కూడా ఆదర్శంగా మారుతుందా?