భారత్ న్యూస్ కరీంనగర్….మాదకద్రవ్య రహిత జిల్లాగా కొమరం భీం ఆసిఫాబాద్: కలెక్టర్ ఆదేశాలు….
కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాను మాదకద్రవ్య రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో కృషి చేయాలని జిల్లా కలెక్టర్ కె. హరిత ఆదేశించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో, మాదకద్రవ్యాల రవాణా, విక్రయం, వినియోగంపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. జిల్లాలోని అన్ని మెడికల్ షాపులు, బెల్ట్ షాపులు, కల్లు డిపోలపై తనిఖీలు నిర్వహించాలని, పాఠశాలలు, కళాశాలల సమీపంలోని పాన్ టేలాలను కూడా తనిఖీ చేయాలని, విద్యార్థులకు మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన కల్పించాలని సూచించారు….
