భారత్ న్యూస్ కరీంనగర్….ప్రజావాణి దరఖాస్తులు త్వరగా పరిష్కరించండి: కలెక్టర్ కుమార్ దీపక్..
మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ, ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి అందిన దరఖాస్తులను వివిధ శాఖల అధికారుల సమన్వయంతో ప్రత్యేక చర్యలు తీసుకుని, వేగంగా పరిష్కరిస్తామని తెలిపారు. సోమవారం నస్పూర్‌లోని సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు పి.చంద్రయ్య, వి.రాములు, జిల్లా రెవెన్యూ అధికారి మోతిరామ్‌లతో కలిసి కలెక్టర్ అర్జీదారుల నుండి నేరుగా దరఖాస్తులను స్వీకరించారు. జిల్లా నలుమూలల నుండి వచ్చిన ప్రజలు తమ సమస్యలపై కలెక్టర్‌కు వినతిపత్రాలు అందజేశారు. సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు…
