భారత్ న్యూస్ విశాఖపట్నం..గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు మీడియా సమావేశం..
వైసీపీ జిల్లా కార్యాలయం మా స్థలంలో నిర్మించారు.. ఏడాది క్రితం కలెక్టర్ కు ఫిర్యాదు చేశాం.. గతంలో నాపై చాలా కేసులు పెట్టారు వైసీపీ హయాంలో రికార్డుల్లో ప్రభుత్వ భూమిగా మార్చారు.. అనుమతులు రాకుండానే కార్యాలయం నిర్మించేశారు.. చట్టాలను తుంగలో తొక్కి కార్యాలయం ఎలా నిర్మిస్తారు?ప్రైవేట్ స్థలం ప్రభుత్వ స్థలంగా ఎలా మారింది?..గవర్నర్ గా బాధ్యతలు చేపట్టకముందు పార్టీకి రాజీనామా చేశా.. కుటుంబానికి రాజీనామా చేయమంటే ఎలా? చట్టాలను కాపాడండి… రాజ్యాంగాన్ని గౌరవించండి చట్టాన్ని చుట్టంగా మార్చుకోవాలని చూస్తే కుదరదు : గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు
