మీరు ప్రయాణించే ట్రైన్ ఆలస్యమైందా? ..అందుకు పరిహారం పొందండిలా!

భారత్ న్యూస్ హైదరాబాద్ .మీరు ప్రయాణించే ట్రైన్ ఆలస్యమైందా? ..అందుకు పరిహారం పొందండిలా!

రైలు ప్రయాణం ఆలస్యమైతే ప్రయాణికులు రైల్వేశాఖ నుంచి పరిహారం పొందవచ్చు. రైలు 3 గంటల కంటే ఎక్కువ ఆలస్యమైతే.. ఐఆర్సీటీసీ వెబ్సైట్లో ‘టీడీఆర్’ ను (TDR) ఫైల్ చేయాలి. రిజర్వేషన్ టికెట్ ఉన్నవారు మాత్రమే దీనికి అర్హులు.

ఏసీ సమస్యలు, దారి మళ్లింపు వంటి కారణాలకు కూడా ఇది వర్తిస్తుంది. ప్రకృతి వైపరీత్యాలు మినహా, ఇతర సాంకేతిక కారణాల వల్ల ఆలస్యమైతే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుని మీరు రీఫండ్ ను పొందవచ్చు….