భారత్ న్యూస్ ఢిల్లీ…..గార్డియన్ ఆఫ్ ది బ్లూ హారిజన్’ పురస్కారాన్ని మన భారత ప్రధాని మోడీజీ కి ప్రదానం చేసిన సీషెల్స్ అధ్యక్షులు హెర్మినీ …
ఈ గౌరవాన్ని నేను వినమ్రంగా స్వీకరిస్తూ, వాతావరణ మార్పుల సవాలును ఎదుర్కొంటున్న, పర్యావరణ పరిరక్షణను భావితరాల పట్ల తమ బాధ్యతగా భావిస్తున్న అన్ని దేశాలకు అంకితం చేస్తున్నాను. ఇది మనం కలిసికట్టుగా అధిగమించాల్సిన అత్యంత కీలకమైన సవాలు.
మన గ్రహాన్ని మరింత పచ్చగా, సుస్థిరంగా మార్చడానికి అవసరమైనదంతా చేయడానికి భారతదేశం తన వంతుగా సిద్ధంగా ఉంది.
మన వివిధ దేశీయ విధానాలు, మిషన్ లైఫ్‌పై ప్రాధాన్యత, అంతర్జాతీయ సౌర కూటమి, విపత్తు నిరోధక మౌలిక సదుపాయాల కూటమి వంటి ప్రపంచ స్థాయి కృషిలో ఇది ప్రతిబింబిస్తుంది.

… భరత ప్రధాని శ్రీ మోడీజీ..