నేడు ‘ప్రమాద జీవిత బీమా పథకం’ ప్రారంభం!

తెలంగాణ :

భారత్ న్యూస్ ఖమ్మం.నేడు ‘ప్రమాద జీవిత బీమా పథకం’ ప్రారంభం!

తెలంగాణ :

ప్రభుత్వ ఉద్యోగులకు ‘ప్రమాద జీవిత బీమా’ పథకాన్ని గురువారం సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించనున్నారు.

రవీంద్రభారతిలో మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించే సమావేశంలో ప్రభుత్వం ఉద్యోగుల తరఫున 14 బ్యాంకులతో ఎంవోయూ చేసుకోనుంది.

ఈ పథకం కింద ఒక్కో ఉద్యోగి, పెన్షనర్‌కు రూ.కోటికి పైగా బీమా కవరేజీ వర్తించనుంది.

రెగ్యులర్‌ ఉద్యోగులతోపాటు కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌, ఇతర తాత్కాలిక ఉద్యోగులందరికీ ఈ పథకం వర్తిస్తుందని ఆర్థిక శాఖ బుధవారం ఓ ప్రకటనలో పేర్కొంది.