భారత్ న్యూస్ ఢిల్లీ…..మోదీ దేశాన్ని నాశనం చేస్తున్నారు: ఖర్గే
ప్రధాని నరేంద్ర మోదీపై ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆదివారం కర్నాటక కాంగ్రెస్ ప్రెసిడెంట్‌గా బి.కె. హరిప్రసాద్ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా నిర్వహించిన మెగా కన్వెన్షన్‌లో ఆయన పాల్గొని ప్రసంగించారు. మోదీ దేశాన్ని నాశనం చేస్తున్నారని ఆరోపించారు. భారతదేశంలో మతం పేరుతో పెద్ద ఎత్తున దోపిడీ జరుగుతోందని, రామమందిర నిర్మాణం కోసం సేకరించిన నిధుల్లో రూ.5,000 కోట్లు దుర్వినియోగం అయినట్లు నివేదికలు వస్తున్నాయని ఖర్గే ఆరోపించారు. రాముడి పేరుతో దోపిడీ కోసమే ఆలయాన్ని నిర్మించారని, హుండీ డబ్బులన్నీ ఎక్కడికి పోతున్నాయో సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
