పరీక్షా కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్, సీపీ….

భారత్ న్యూస్ ఖమ్మం.పరీక్షా కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్, సీపీ….

మంచిర్యాల జోన్‌లో ఈ నెల 21న జరగనున్న నీట్ రీ-ఎగ్జామినేషన్‌ను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. గురువారం సీపీ అంబర్ కిషోర్ ఝా, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మంచిర్యాల పట్టణంలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలను, ముఖ్యంగా జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలను సందర్శించి, అభ్యర్థులకు కల్పిస్తున్న వసతులు, భద్రతా ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. పరీక్షను అత్యంత పారదర్శకంగా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిర్వహించేందుకు పక్కా ప్రణాళికతో భద్రతా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు…