కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో బలోపేతం చేద్దామని నాన్న అభిమానులను కోరుకుంటున్నా.

భారత్ న్యూస్ శ్రీకాకుళం….విజయవాడ

వైఎస్ షర్మిలా రెడ్డి
APCC చీఫ్

కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో బలోపేతం చేద్దామని నాన్న అభిమానులను కోరుకుంటున్నా.

అభివృద్ధికి నిర్వచనం, సంక్షేమానికి సంతకం మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి.

జనహితమే ప్రజాహితం దివంగత ముఖ్యమంత్రి మూలసూత్రం.

సరిగ్గా 22 ఏళ్ల క్రితం మే 14 న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా..

ఆనాడు YSR ప్రమాణ స్వీకారం రాష్ట్రానికి నవశకం.

పెట్టిన తొలిసంతకం,అమలు చేసిన పథకాలు నేటికి రాష్ట్ర చరిత్రలో సువర్ణాధ్యాయం.

ప్రజల మనసులు గెలిచి, ప్రేమాభిమానాలు చూరగొని,

దేవుడి పటాల పక్కన స్థానం పొందిన ఏకైక నాయకుడు కాంగ్రెస్ నేత YSR.

కోట్లాది మంది జనం నేటికి YSR ను మరవలేదంటే..

ఆయన 5 ఏళ్ల పాలన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక బెంచ్ మార్క్.

YSR బిడ్డగా, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా,

రాజశేఖర్ రెడ్డి అభిమానులకు చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నా.

YSR ఐడియాలజీ ఉన్నది ఒక్క కాంగ్రెస్ పార్టీలోనే.

YSR వారసత్వం కొనసాగేది కాంగ్రెస్ లోనే.

YSR ఆశయ సాధన జరిగేది కాంగ్రెస్ తోనే.

YSR ముమ్మాటికి కాంగ్రెస్ మనిషి.

YSR అంటే కాంగ్రెస్.. కాంగ్రెస్ అంటే YSR.

ఆనాటి సువర్ణ యుగాన్ని మళ్లీ సాకారం చేసేందుకు ..

మహానేత కడదాకా బ్రతికిన కాంగ్రెస్ ను రాష్ట్రంలో అధికారంలోకి తెద్దాం.

దివంగత నేత ఆశయాలను అమలు చేసేలా చేయి చేయి కలుపుదాం.