అమూల్ పాల ధరలు మరోసారి పెరిగాయి. లీటర్కు రూ.2 చొప్పున

భారత్ న్యూస్ హైదరాబాద్…మరోసారి పెరిగిన పాల ధరలు

అమూల్ పాల ధరలు మరోసారి పెరిగాయి. లీటర్కు రూ.2 చొప్పున ధరలను పెంచినట్లు అమూల్ ప్రకటించింది. పెరిగిన పాల ధరలు రేపటి నుంచి అమలులోకి వస్తాయని వెల్లడించింది. పాల ఉత్పత్తి, నిర్వహణ ఖర్చులు పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. కాగా మే 1న రూ.2 పెంచిన అమూల్ మరోసారి పాల ధరలను పెంచడంపై వినియోగదారులు మండిపడుతున్నారు