భారత్ న్యూస్ హైదరాబాద్…పక్కపక్కనే కూర్చున్న మోదీ, రేవంత్

Ammiraju Udaya Shankar.sharma News Editor…హైదరాబాద్ పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిల మధ్య ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. హెచ్ఐసీసీ (HICC)లో జరిగిన కార్యక్రమంలో వీరిద్దరూ పక్కపక్కనే కూర్చుని, నవ్వుతూ ముచ్చటించుకోవడం చర్చనీయాంశమైంది. అంతకుముందు, ప్రధానికి రేవంత్ రెడ్డి వెండి నంది జ్ఞాపికను బహూకరించి, శాలువాతో ఘనంగా సత్కరించారు. విభేదాలు పక్కన పెట్టి, రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్ర-రాష్ట్ర నేతలు ఇలా ఆత్మీయంగా కలవడం విశేషం.
