భారత్ న్యూస్ విశాఖపట్నం..ద్రోణి ప్రభావం.. నేడు రాష్ట్రంలో భారీ వర్షాలు
ఆంధ్రప్రదేశ్‌లో :- ద్రోణి ప్రభావంతో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, శ్రీసత్యసాయి, వైఎస్సార్ కడప, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. అల్లూరి, పోలవరం, ఏలూరు జిల్లాల్లో తీవ్ర వడగాల్పులు, వడగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. రైతులు, కూలీలు, పశు కాపరులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది….
