భారత్ న్యూస్ శ్రీకాకుళం…తిరుపతి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ చిత్రపటాలకు పాలాభిషేకం
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న నారా లోకేష్ కు పాలాభిషేకంతో వడ్డెర్లు ఆనందం
క్వారీల్లో 15% సీనరే జీ లో 50% మినహాయంపై వడ్డెరల హర్షం
గురువారంనాడు జరిగిన రాష్ట్ర క్యాబినెట్లో వడ్డెర్లకు 15% క్వారీల్లో వాటా ఇవ్వడం, సీనరే జీ లో 50% రాయితీ మినహాయింపు క్యాబినెట్ ఆమోదించడం పట్ల హర్షం వ్యక్త చేస్తూ రాష్ట్ర వడ్డెర సంక్షేమ సంఘం అధ్యక్షులు తిరుపతి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కృష్ణాజిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలోని కోడూరు గ్రామంలో శుక్రవారం నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ యువ నాయకుడు,యువ గళం రథసారధి మంత్రి నారా లోకేష్ చిత్రపటాలకు పాలాభిషేకాన్ని నిర్వహించారు.
స్థానిక ఐదో వార్డ్ లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా ముఖ్యఅతిథిగా మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బండే శ్రీనివాసరావు పాల్గొన్నారు.
ముందుగా తెలుగుదేశం పార్టీ నాయకులు, వడ్డెర సంఘ నేతలు, మహిళలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్,నారా లోకేష్ చిత్రపటాలకు పాలాభిషేక నిర్వహించారు.
ఈ సందర్భంగా బండే శ్రీనివాసరావు మాట్లాడుతూ తిరుపతి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఇటువంటి కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని, తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా బీసీలు పక్షపాతంగా ఉంటుందని, మేనిఫెస్టోలో ఇచ్చిన మాట ప్రకారం క్వారీల్లో వడ్డెరలకు సముచిత స్థానం కల్పించడం పట్ల నారా లోకేష్ యొక్క పనితనానికి గొప్పతనానికి నిదర్శమని ఆయన అన్నారు.
చంద్రబాబు నాయుడు,పవన్ కళ్యాణ్,నారా లోకేష్ సారధ్యంలో వడ్డెరలకు సముచిత స్థానాన్ని కల్పించడం జరిగిందని ఆయన అన్నారు.
వడ్డెర సంఘ నాయకులు వేముల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న నారా లోకేష్ కు వడ్డెర జాతి ప్రజలతో కూడా రుణపడి ఉంటామని, అట్టడుగు స్థాయిలో ఉన్న వడ్డెర జాతి ప్రజలు వారి ఎదుర్కొంటున్న సమస్యలుగురించి యువ నాయకులు నారా లోకేష్ దృష్టికి తిరుపతి శ్రీనివాసరావు తీసుకువెళ్లారని, ఇచ్చిన హామీను నెరవేర్చినందుకు హర్షం వ్యక్తం చేస్తూ తిరుపతి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఈ విధంగా పాలాభిషేకం కార్యక్రమం నిర్వహించడం జరిగిందని ఆయన అన్నారు.
ఈ సందర్భంగా ప్రజలకు మిఠాయిలు పంచి ఆనందాన్ని వ్యక్తపరిచారు .

ఈ కార్యక్రమంలో కోడూరు పిఎసిఎస్ డైరెక్టర్ పూత బోయన శ్రీనివాసరావు, నీటి సంఘాల అధ్యక్షులు బొలిశెట్టి వెంకటేష్, వార్డ్ మెంబర్ వేముల యాలాద్రి , కొక్కిలిగడ్డ జాన్ విల్సన్, గోలి సాంబశివరావు, తిరుపతి వీరాంజనేయులు, బండారు రవీంద్ర, తిరుపతి వెంకట నాంచారయ్య, బొడ్డు వెంకన్న, బండే వెంకటేశ్వరరావు, కోట వెంకటేశ్వరరావు తో పాటు పెద్ద సంఖ్యలో వడ్డెర సంఘ నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.