ఈ విధమైన కార్యక్రమాల ద్వారా యువతను సురక్షితమైన, బాధ్యతాయుతమైన దిశలో నడిపించేందుకు పోలీస్ శాఖ తమవంతు కృషి చేస్తూనే ఉందని అధికారులు తెలిపారు.

భారత్ న్యూస్ తిరుపతి…తిరుపతి జిల్లా పోలీస్ శాఖ.
తేది: 27-03-2026.

ఈ విధమైన కార్యక్రమాల ద్వారా యువతను సురక్షితమైన, బాధ్యతాయుతమైన దిశలో నడిపించేందుకు పోలీస్ శాఖ తమవంతు కృషి చేస్తూనే ఉందని అధికారులు తెలిపారు.

విద్యార్థుల్లో అవగాహన – శక్తి టీమ్ ప్రత్యేక కార్యక్రమం.

యువత భవిష్యత్తుకు దిశానిర్దేశం.

సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై చైతన్యం.

తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు ఐపీఎస్., గారి ఆదేశాల మేరకు, శక్తి టీమ్ పోలీసులు తిరుపతిలోని SGS ఆర్ట్స్ కాలేజీలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ శ్రీ రవి మనోహరాచారి గారు, మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ శ్రీలత గారు, సీఐ తమీమ్ అహ్మద్ గారు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా విద్యార్థులకు చదువు యొక్క ప్రాముఖ్యత, ఉపాధ్యాయుల విలువ, సమయాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం వంటి అంశాలపై వివరంగా అవగాహన కల్పించారు. అలాగే వేగంగా వాహనాలు నడపడం వలన కలిగే ప్రమాదాలు, యుక్తవయస్సులో వచ్చే ఆకర్షణల వల్ల ఎదురయ్యే సమస్యలు గురించి తెలియజేశారు.

మాదకద్రవ్యాలకు బానిసలైతే కలిగే నష్టాలు, చట్టపరమైన శిక్షలు, జీవితంలో మంచి లక్ష్యాలను ఎంచుకుని వాటిని సాధించేందుకు కృషి చేయాల్సిన అవసరాన్ని వివరించారు. అదనంగా మొబైల్ ఫోన్ల వినియోగంపై నియంత్రణ, క్రమశిక్షణ పాటించడం వంటి అంశాలపై సూచనలు ఇచ్చారు.

సైబర్ నేరాల నేపథ్యంలో అనుమానాస్పద లింక్స్‌ను ఓపెన్ చేయకూడదని, సోషల్ మీడియాలో వ్యక్తిగత సమాచారం, ఫోటోలు పంచుకోవడం వల్ల కలిగే ప్రమాదాలు, లోన్ యాప్స్, ఆన్‌లైన్ బెట్టింగ్ వంటి మోసాలపై విద్యార్థులకు స్పష్టమైన అవగాహన కల్పించారు.