తెలంగాణలో డ్రైవింగ్ లైసెన్స్‌పై కొత్త రూల్స్

…భారత్ న్యూస్ హైదరాబాద్….తెలంగాణలో డ్రైవింగ్ లైసెన్స్‌పై కొత్త రూల్స్

తెలంగాణలో డ్రైవింగ్ లైసెన్స్ రూల్స్ కఠినమవుతున్నాయి. ఇకపై లైసెన్స్ పొందాలంటే పాత రెండు పరీక్షలతో పాటు మరో అదనపు టెస్ట్ తప్పనిసరి. తెలంగాణ రవాణాశాఖ ఏప్రిల్ 1 నుంచి ఈ కొత్త విధానాన్ని అమలు చేయనుంది. ఇప్పటివరకు ఎల్‌ఎల్‌ఆర్, డ్రైవింగ్ టెస్ట్‌లే ఉండగా, ఇకపై ముందుగా ఆన్‌లైన్ రోడ్ సేఫ్టీ అవేర్‌నెస్ మాడ్యూల్స్ టెస్ట్ రాయాలి. ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన తర్వాతే ఎల్‌ఎల్‌ఆర్‌కు దరఖాస్తు చేయాలి. కాగా, ఈ చర్యలతో రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయని ప్రభుత్వం భావిస్తోంది…