ఆర్‌ఏసీ (RAC) కింద టికెట్లకు పూర్తి చార్జీ సమర్థనీయం కాదు

భారత్ న్యూస్ రాజమండ్రి…ఆర్‌ఏసీ (RAC) కింద టికెట్లకు పూర్తి చార్జీ సమర్థనీయం కాదు

రైలు ప్రయాణంలో ఆర్‌ఏసీ క్యాటగిరీ కింద బుక్‌ చేసుకున్న టికెట్లకు పూర్తి చార్జీ వసూలు చేయటం సమర్థనీయం కాదని పార్లమెంటరీ కమిటీ పేర్కొన్నది. ఆర్‌ఏసీలోనే ఉండి బోర్డింగ్‌ సమయంలో బెర్త్‌ లభించని ప్రయాణికులకు చార్జీలో కొంతమేర తిరిగి ఇవ్వాలని సూచించింది. ఇందుకోసం ప్రత్యేక వ్యవస్థను రూపొందించాల్సిన అవసరముందని తెలిపింది. పార్లమెంట్‌కు సమర్పించిన నివేదికలో ప్రజా పద్దుల కమిటీ పై విషయాన్ని పేర్కొన్నది.

ప్రస్తుతం ఆర్‌ఏసీ కింద బెర్త్‌ బుక్‌ చేసుకునే ప్రయాణికుల నుంచి పూర్తిమొత్తంలో టికెట్‌ చార్జీ వసూలు చేస్తున్నారు. ఇదే క్యాటగిరీ కింద ఉండే మరో ప్రయాణికుడితో బెర్త్‌ పంచుకోవాల్సి వస్తున్నది.