కుదిరిన ఒప్పందం.. హర్మూజ్ జలసంధికి మళ్లీ ఊపిరి!

భారత్ న్యూస్ గుంటూరు…కుదిరిన ఒప్పందం.. హర్మూజ్ జలసంధికి మళ్లీ ఊపిరి!

ఇరాన్‌-అమెరికా మధ్య ఒప్పందం కుదిరిన నేపథ్యంలో ప్రపంచ చమురు రవాణాకు జీవనాడిగా పేర్కొనే హర్మూజ్‌కు మళ్లీ ఊపిరి పోసినట్లయ్యింది. ఆంక్షల నేపథ్యంలో కొంతకాలంగా అక్కడ వందలాది నౌకలు చిక్కుకుపోగా.. తాజాగా పరిస్థితులు కుదుటపడడంతో తిరిగి తమ ప్రయాణాన్ని కొనసాగించేందుకు ఆయా నౌకలు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఒప్పందం తక్షణమే అమల్లోకి రావడంతో కొన్ని నౌకలు ఇప్పటికే ఆ మార్గంలో బయలుదేరినట్లు తాజా నివేదికలు పేర్కొంటున్నాయి. కాగా ఈ పరిణామం ప్రపంచ ఇంధన మార్కెట్‌కు పెద్ద ఉపశమనం కలిగించే పరిణామంగా నిపుణులు భావిస్తున్నారు….