మెదక్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగురవేయాలి,ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్

భారత్ న్యూస్ హైదరాబాద్..

మెదక్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగురవేయాలి

ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్

పోతంశెట్టిపల్లి పెద్దమ్మగుడి ప్రతిష్టపానలో
పాల్గొన్న ఎంపీ అభ్యర్ధి నీలం మధు

ప్రతిష్టాత్మకమైన మెదక్ గడ్డపై కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగురవేయాలని ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ పిలుపునిచ్చారు. ఇందుకోసం పార్టీ నేతలు, ముఖ్యులు, కార్యకర్తలు అందరూ శ్రమించాల్సిన అవసరం ఉందన్నారు. నర్సాపూర్ నియోజకవర్గం పోతంశెట్టిపల్లిలో నూతనంగా నిర్మించిన పెద్దమ్మ గుడి అమ్మవారి విగ్రహ ప్రతిష్ట, జాతర ఉత్సవాలకు ఎంపీ అభ్యర్థి నీలం మధు మంగళవారం హాజరయ్యారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకోగా పండితులు ప్రత్యేక పూజలు జరిపించారు. అనంతరం ఆలయ కమిటీ నీలం మధు గారిని ఘనంగా సన్మానించారు. అనంతరం ఎంపీ అభ్యర్థి నీలం మధు మాట్లాడుతూ.. ప్రజల సంక్షేమం, అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ పాటుతోందన్నారు. మెదక్ గడ్డపై నుంచి పోటీ చేసి ప్రధాని అయినా ఇందిరాగాంధీ ఈ ప్రాంతానికి ఎంతో మేలు చేశారన్నారు. ఇందిరాగాంధీ కుటుంబానికి రుణం తీర్చుకునే అవకాశం మెదక్ జిల్లా వాసులకు వచ్చిందని తెలిపారు. ఎంపీగా పోటీ చేస్తున్న తనను భారీ మెజారిటీతో గెలిపించాలని మెదక్ జిల్లా వాసులను నీలం మధు ముదిరాజ్ అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో మెదక్ డిసిసి అధ్యక్షులు ఆంజనేయులుగౌడ్, నర్సాపూర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి, INTUC జిల్లా అధ్యక్షులు నరసింహారెడ్డి, మాజీ జెడ్పిటిసి శ్రీనివాస్ గుప్తా, రవీందర్ రెడ్డి, గుర్రాల మల్లేష్, ఉదయ్ కుమార్, శివకుమార్, నాగులూరి మల్లేష్, వెంకట్ గౌడ్, ట్రస్ట్ సభ్యులు వెంకటేశ్వరశర్మ,, శివకుమార్ గౌడ్, పురుషోత్తం శర్మ, పద్మ మహేష్, మారుమూల వెంకటరమణ, పోతంశెట్టిపల్లి గ్రామ సర్పంచ్ గడ్డమీది నాగరాణి నర్సింహులు, ముద్రాజ్ సంఘం అధ్యక్షుడు బోలె కృష్ణయ్య, ఉపాధ్యక్షులు చింతకుంట యాదగిరి, కుల్చారం ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు గడ్డమీద నర్సింహులు, వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు, పోతంశెట్టిపల్లి గ్రామస్తులు పాల్గొన్నారు.