Does the chief minister not see the prestige of the courts across the state and the movement

భారత్ న్యూస్ హైదరాబాద్,

రాష్ట్రవ్యాప్తంగా కోర్టుల ప్రతిష్ట మన న్యాయవాదుల ఉద్యమం ముఖ్యమంత్రి గారికి కనిపించలేదా????? మచిలీపట్నం బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు లంకిశెట్టి బాలాజీ

ప్రజా వ్యతిరేక చీకటి చట్టం, ఆంధ్రప్రదేశ్ గత 15 రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా న్యాయవాదులు విధులు బహిష్కరించి ఉద్యమాలు చేస్తుంటే, కోర్టులలో కేసుల ప్రతిస్పందన ఏర్పడితే రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించకపోవడం విచారకరమని మచిలీపట్నం బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు లంకిశెట్టి బాలాజీ అన్నారు. మంగళవారం మచిలీపట్నంలో విలేకరుల సమావేశంలో బాలాజీ మాట్లాడుతూ ఎందరో న్యాయం నిపుణులు మేధావులు తిరస్కరించిన ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను ఏకపక్షంగా ఏ విధమైన చర్చ లేకుండా అసెంబ్లీలో ఏకగ్రీవంగా చట్టాన్ని చేయటం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. ఈ చట్టం భారత రాజ్యాంగంకు విరుద్ధంగా ఉందని బాలాజీ అన్నారు. 500 పైగా న్యాయస్థానాల్లో పరిష్కారం చేయలేని సివిల్ తగాదాలను, న్యాయ శాస్త్రం పై పరిజ్ఞానం లేని 28 మంది జిల్లా స్థాయి అధికారులు పరిష్కారం చేస్తారని చెప్పటం సరైనది కాదని బాలాజీ అన్నారు. నూతన చట్టంలో సెక్షన్ 38 ప్రకారం సివిల్ కోర్టు పరిధిలో తొలగించి, ప్రభుత్వం నియమించే విచారణ అధికారి అధికారి నిర్ణయంపై సవాల్ చేయడానికి హైకోర్టుకి వెళ్లాలని నూతన చట్టంలో పొందుపరచడం వల్ల ప్రజలకు మరింత ఆర్థిక భారం పడుతుందని, న్యాయం దూరం అవుతుందని బాలాజీ అన్నారు. ప్రజల కోసం చేస్తున్న న్యాయవాదులు ప్రజా ఉద్యమంలో అనేక రకాలుగా తమ నిరసనను వ్యక్తం చేస్తున్న, ఎమ్మెల్యేలు ఎంపీలు పెదవి విప్పకపోవడం వారి యొక్క అసక్తిని తెలియజేస్తుందని బాలాజీ పేర్కొన్నారు. తక్షణమే త్రీ మంత్ కమిటీని ఏర్పాటు చేసి నూతన చట్టంపై రివ్యూ నిర్వహించి కొత్త చట్టాన్ని రీకాల్ చేయాలని బాలాజి డిమాండ్ చేశారు. ఈ ప్రజా ఉద్యమానికి ప్రభుత్వం స్పందించకపోతే రాబోయే రోజులలో బ్యాలెట్ రూపంలో ప్రజలు తమ నిర్ణయాన్ని తెలియజేస్తారని బాలాజీ తెలిపారు. నూతన చట్టం వల్ల ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ నాయకుల కనుసన్నలలో అధికారులు పనిచేస్తారని బాలాజీ అన్నారు. ఇప్పటికే 41 సి ఆర్ పి సి ద్వారా క్రిమినల్ చట్టానికి తూట్లు పొడిచారని, ఇప్పుడు సివిల్ చట్టాలకి తూట్లు పొడుస్తున్నారని బాలాజీ అన్నారు. భారతదేశంలో ఏ రాష్ట్రంలోని లేని చట్టాన్ని ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయటం కేవలం భూకబ్జాదారులకి రాచబాట వేయటమేనని బాలాజీ హెచ్చరించారు. తక్షణమే రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించి న్యాయవాదులు విధులు బహిష్కరణకు పరిష్కారం చూపాలని ,చట్టాన్ని నిలుపుదల చేసి పేద మధ్యతరగతి ప్రజలను వారి హక్కులను కాపాడాలని బాలాజీ డిమాండ్ చేశారు