Achievements of South Central Railway Defense Force in November 2023

నవంబర్ 2023 లో దక్షిణ మధ్య రైల్వే రక్షణ దళం సాధించిన విజయాలు

  • ‘నాన్హే ఫారిస్టే ‘ లో భాగంగా నవంబర్ 2023లో 107 మంది పిల్లలను రక్షించిన దక్షిణ మధ్య రైల్వే ఆర్‌.పి.ఎఫ్ సిబ్బంది.
  • నవంబర్-2023 నెలలో 30 మంది వ్యక్తుల అరెస్టుతో రూ.1.79 కోట్ల కంటే ఎక్కువ విలువైన గంజాయి జప్తు. రైల్వే రక్షణ దళం (ఆర్ పి ఎఫ్)కు రైల్వే ఆస్తులు, ప్రయాణీకులు సంచరించే ప్రదేశాలు మరియు ప్రయాణీకుల భద్రతను నిర్వహించే బాధ్యతలను అప్పగించబడింది. రైల్వే ఆస్తుల పరిరక్షణలో నేరస్థులను గుర్తించడానికి అలుపెరగని పోరాటాన్ని కొనసాగించడం, ప్రయాణీకుల రక్షణ మరియు భద్రతను కాపాడటంతోపాటు ఆర్ పి ఎఫ్ రైల్వే ఆస్తులను కాపాడుకోవడంలో తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి ప్రయాణీకుల ప్రాణాలను కాపాడటంలో కుడా ఆర్ పి ఎఫ్ ఎల్లప్పుడూ ముందంజలో ఉంటుంది. రైల్వే ఆస్తుల భద్రత, ప్రయాణీకుల రక్షణ మరియు వివిధ ప్రతికూల పరిస్థితుల్లో ప్రయాణీకులకు సహాయం అందించడం వంటి వాటిపై దృష్టి కేంద్రీకరించడానికి, ప్రభుత్వ పోలీసులు మరియు చట్టాన్ని అమలుచేసే ఏజెన్సీలతో సమన్వయం చేసుకుంటూ ఆర్ పి ఎఫ్ అనేక కార్యకలాపాలను ప్రారంభించి మెరుగైన పనితీరును నమోదు చేసింది. నవంబర్ 2023 నెలలో ఆర్‌.పి.ఎఫ్/దక్షిణ మధ్య రైల్వే సాధించిన విజయాల సంక్షిప్త సమాచారం క్రింది విధంగా ఉంది :-
  1. “ఆపరేషన్ యాత్రి సురక్ష” ద్వారా నవంబర్-2023లో, ఆర్‌.పి.ఎఫ్/దక్షిణ మధ్య రైల్వే 44 మంది నేరస్థులను అరెస్టు చేసి దొంగతనానికి గురైన రూ. 25.92 లక్షల విలువ గల సొత్తును స్వాధీనపర్చుకోవడం జరిగింది .ఈ ఘటనలకు సంబంధించి 52కేసులు నమోదయ్యాయి.
  2. ” ఆపరేషన్ అమానత్ “: సామాను తిరిగి పొందడం మరియు అప్పగించడం కింద నవంబర్ 2023లో ఆర్ పి ఎఫ్ సిబ్బంది 184 ప్రయాణికులకు సంబందించిన సుమారు 53లక్షల పై బడి విలువగల సామానును సురక్షితంగా కాపాడి వారికీ తిరిగి అందించడంలో సహాయపడటం జరిగింది
  3. రైల్వేల ద్వారా మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టేందుకు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ” ఆపరేషన్ నార్కోస్ ” ను ప్రారంభించింది . ఈ ఆపరేషన్ కింద, నవంబర్ -2023 నెలలో 30 మంది వ్యక్తుల అరెస్టుతో రూ.1.79 కోట్ల కంటే ఎక్కువ విలువైన గంజాయిని ఆర్‌పిఎఫ్ జప్తు చేసింది .
  4. “ ఆపరేషన్ నాన్ హే ఫారిస్టే” కింద , వివిధ కారణాల వల్ల వారి కుటుంబం నుండి తప్పిపోయిన/పారిపోయి సంరక్షణ & రక్షణ అవసరమైన పిల్లలను గుర్తించి వీరిని రక్షించే ఒక ఉన్నతమైన గొప్ప కార్యక్రమాన్ని ఆర్ పి ఎఫ్ చేపట్టింది. దీని ద్వారా నవంబర్ -2023 నెలలో మొత్తం 107 మంది పిల్లలకు (93 మంది బాలురు + 14 మంది బాలికలు) భద్రత కల్పించారు .
  5. మానవ అక్రమ రవాణా కు వ్యతిరేకంగా -ఆపరేషన్ ఆహ్ట్ ని ప్రారంభించింది . దీని ద్వారా ఆర్‌పిఎఫ్/దక్షిణ మధ్య రైల్వే 08 మంది ట్రాఫికర్ల బారి నుండి 46 మంది అబ్బాయిలను విముక్తి చేసింది.
  6. నవంబర్ -2023 నెలలో “ ఆపరేషన్ సటార్క్ ” కింద , రైళ్లలో అక్రమంగా రవాణా చేస్తున్న రూ .4,56,037 /- విలువైన మద్యాన్ని 13 మందిని అరెస్టు చేసి, ఆపై ఎక్సైజ్ శాఖకు అప్పగించారు. వారు నేరస్థులపై 35 కేసులు నమోదు చేశారు.
  7. దళారుల కార్యకలాపాలను గణనీయంగా అరికట్టడానికి మరియు సామాన్యులకు రైల్వే టిక్కెట్లను అందుబాటులో ఉంచడానికి రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ” ఆపరేషన్ ఉపలబ్ద్ ” కింద నవంబర్-2023 నెలలో, 36 దళారులను అరెస్టు చేయడం ద్వారా 39 కేసులు నమోదు చేయబడ్డాయి. 201 లైవ్ టిక్కెట్లు మరియు మొత్తం రూ.5,13,685/- విలువైన టిక్కెట్‌లను స్వాధీనం చేసుకున్నారు.
  8. రైల్వే ఆస్తికి వ్యతిరేకంగా జరిగే నేరాల కార్యకలాపాలను అరికట్టడానికి రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ” ఆపరేషన్ రైల్ సురక్ష ” ను ప్రారంభించింది. నవంబర్-2023 నెలలో, రూ.3,32,591/- విలువైన చోరీకి గురైన రైల్వే సొత్తును రికవరీ చేయడం ద్వారా 35 కేసులు నమోదు చేయబడ్డాయి.