Vande Bharat Express trains introduced in South Central RailwaySuccessful with more than 100% acceptance

..Bharathnews.hyd,,,

దక్షిణ మధ్య రైల్వేలో ప్రవేశపెట్టబడిన వందే భారత్ ఎక్స్‌ ప్రెస్ రైళ్లు
100% కంటే ఎక్కువ ఆదరణతో విజయవంతం
• దక్షిణ మధ్య రైల్వేలోని వివిధ స్టేషన్ల నుండి ప్రారంభించబడిన నాలుగు వందే భారత్ ఎక్స్‌ ప్రెస్ రైళ్లు డిసెంబర్ 2023లో 100% కంటే ఎక్కువ ఆదరణ పొందాయి.

2023 సంవత్సరంలో దక్షిణ మధ్య రైల్వేలో ప్రవేశపెట్టిన నాలుగు వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లు డిసెంబర్ 2023లో 100% కంటే ఎక్కువ ప్రోత్సాహాన్ని నమోదు చేయడంతో వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లకు భారీ ప్రజాదరణ దక్షిణ మధ్య రైల్వే అంతటా విశేష గుర్తింపు పొందింది. దీనికి అదనముగా దక్షిణ మధ్య రైల్వే లో జాల్నా నుండి ముంబై సీ. ఎస్. టి. ఎమ్. వరకు మరొక వందే భారత్ ఎక్స్‌ ప్రెస్ ప్రవేశపెట్టబడింది మరియు ఈ రైలు ఈ రోజు అనగా జనవరి 1, 2024 నుండి ముంబై నుండి ప్రారంభమవుతుంది. దక్షిణ మధ్య రైల్వేఅంతటా నడుస్తున్న నాలుగు వందే భారత్ (వీ. బి ) రైళ్ల జాబితా మరియు వాటి ఆక్యుపెన్సీ వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.
• సికింద్రాబాద్ – విశాఖపట్నం వందే భారత్ ఎక్స్‌ ప్రెస్ :
జనవరి, 2023లో ప్రవేశపెట్టబడిన 16 కోచ్‌లతో సికింద్రాబాద్ – విశాఖపట్నం వందే భారత్ ఎక్స్‌ ప్రెస్ 100% కంటే ఎక్కువ ఆక్యుపెన్సీతో స్థిరంగా నడుస్తోంది . డిసెంబర్, 2023లో సికింద్రాబాద్ – విశాఖపట్నం ఆక్యుపెన్సీ 134% వద్ద ఉండగా, విశాఖపట్నం – సికింద్రాబాద్ ఎక్స్‌ ప్రెస్ 143% వద్ద ఉంది.
• సికింద్రాబాద్ – తిరుపతి వందే భారత్ ఎక్స్‌ ప్రెస్ ;
ఏప్రిల్ 2023లో ప్రవేశపెట్టబడిన 8 కోచ్‌లతో కూడిన సికింద్రాబాద్ – తిరుపతి వందే భారత్ ఎక్స్‌ ప్రెస్ కూడా ప్రవేశపెట్టినప్పటి నుండి పూర్తి ఆక్యుపెన్సీతో స్థిరంగా నిర్వహించబడుతోంది. అపారమైన స్పందన కారణంగా, ఈ రైలుకు మే 17, 2023 నుండి కోచ్‌లు 16 కోచ్‌లకు పెంచబడ్డాయి. డిసెంబర్ 2023లో సికింద్రాబాద్ – తిరుపతి ఎక్స్‌ ప్రెస్ ఆక్యుపెన్సీ 114% కాగా, తిరుపతి – సికింద్రాబాద్ ఎక్స్‌ ప్రెస్ 105% వద్ద ఉంది.

• కాచిగూడ – యశ్వంత్‌పూర్ వందే భారత్ ఎక్స్‌ ప్రెస్:
సెప్టెంబర్, 2023లో ప్రవేశపెట్టిన 8 కోచ్‌లతో కూడిన కాచిగూడ – యశ్వంత్‌పూర్ వందే భారత్ ఎక్స్‌ ప్రెస్ కూడా ప్రజాదరణ పొందింది మరియు డిసెంబర్, 2023లో రైలు ఆక్యుపెన్సీ 107% వద్ద ఉండగా తిరుగు దిశలో, యశ్వంత్‌పూర్ – కాచిగూడ ఎక్స్‌ప్రెస్ ఆక్యుపెన్సీ 110% వద్ద ఉంది.
• విజయవాడ- ఎమ్. జి. ఆర్ చెన్నై – వందే భారత్ ఎక్స్‌ ప్రెస్
విజయవాడ – ఎమ్. జి. ఆర్ చెన్నై – వందే భారత్ ఎక్స్‌ ప్రెస్ 8 కోచ్‌లతో సెప్టెంబరు, 2023లో ప్రవేశపెట్టబడి ప్రపంచ ప్రసిద్ధ యాత్రికుల గమ్యస్థానమైన తిరుపతిని కలుపుతూ ప్రత్యేక గుర్తింపు పొందింది. ఈ రైలు ఆక్యుపెన్సీ 126%గా నమోదు కాగా, ఎమ్. జి. ఆర్ చెన్నై – విజయవాడ వందే భారత్ ఎక్స్‌ ప్రెస్ 119%గా నమోదైంది.

వందే భారత్ ఎక్స్‌ ప్రెస్ రైలు అనుకూలమైన, సురక్షితమైన మరియు సౌకర్యవంతమైన ప్రయాణoగా ప్రసిద్ధి చెందింది. ఈ రైలు ఏ. సీ. చైర్ కార్ మరియు ఎగ్జిక్యూటివ్ క్లాస్ కోచ్‌లలో పూర్తి సిట్టింగ్ ఏ. సీ వసతితో పగటిపూట ప్రయాణాన్ని అందిస్తుంది. దేశీయంగా అభివృద్ధి చేసిన ఈ రైలులో జి . పి. ఎస్ ఆధారిత ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, ఆటోమేటిక్ స్లైడింగ్ డోర్లు, రిక్లైనింగ్ సీట్లు, అన్ని కోచ్‌లలో సీ సీ. టి. వీ కెమెరాలు, డిఫ్యూజ్డ్ ఎల్.ఇ.డి లైటింగ్, ప్రతి సీటు కింద ఛార్జింగ్ పాయింట్లు వంటి అనేక ప్రపంచ స్థాయి సౌకర్యాలు ఉన్నాయి తద్వారా మెరుగైన ప్రయాణ సౌకర్యం మరియు మరింత భద్రతను అందిస్తాయి.
దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ శ్రీ అరుణ్‌కుమార్‌ జైన్‌ వందేభారత్‌ ఎక్స్‌ ప్రెస్‌ రైళ్లు పూర్తి ఆక్యుపెన్సీతో నడవడం పట్ల సంతృప్తిని వ్యక్తం చేశారు. జోన్లో వివిధ మార్గాల్లో ప్రవేశపెట్టిన భారతదేశ స్వదేశీ సెమీ-హై స్పీడ్ రైలుకు అపారమైన ప్రజాదరణను ప్రతిబింబిస్తుందని ఆయన పేర్కొన్నారు. రైలు ప్రయాణీకుల అవసరాలను తీర్చడం రైల్వే యొక్క ప్రధాన లక్ష్యమని , రైలు ప్రయాణీకుల ఆకాంక్షలను నెరవేర్చడానికి అన్ని ప్రయత్నాలు కొనసాగుతాయని ఆయన తెలియజేశారు .