CPI 99th Anniversary News.Sacrifices that no political party has made for the country’s

భారత్ న్యూస్ హైదరాబాద్..,

సిపిఐ 99 వ వార్షికోత్సవ వార్త.
దేశ స్వాతంత్య్రం, సమైఖ్యత,సమగ్రత కోసం ఏ రాజకీయ పార్టీలు చేయని త్యాగాలు కమ్యూనిస్టు పార్టీ చేసిందని పలువురు వక్తలు కొనియడారు.
మతోన్మాద, ఫాసిస్టు విధానాలతో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని ఖూనీచేస్తున్న మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వామపక్ష, ప్రజాతంత్ర, లౌకిక శక్తులు ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్ సిపిఐ రాష్ట్ర కార్యాలయంలోని మగ్ధూంభవన్ భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) 99వ ఆవిర్భావ దినోత్సవం మంగళవారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అరుణపతాకాన్ని సిపిఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి ఎగురవేశారు. “జోహార్ అమరవీరులకు జోహార్, లాంగ్ లీవ్ సిపిఐ.లాంగ్ లీవ్ లాంగ్ ప్రజాపోరాటాలు వర్ధిల్లాలి లాంగ్ లీవ్ మార్కిజం లెనినిజం” అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. అనంతరం సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ, కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్ రెడ్డి, జాతీయ సమితి సభ్యులు పల్లా వెంకట్ రెడ్డి, సిపిఐ సీనియర్ నాయకుడు కందిమళ్ల ప్రతాప్ రెడ్డి, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వి.ఎస్.బోస్, ఎన్.బాలమల్లేష్, ఈ.టి.నర్సింహ, ఎఐటియుసి సీనియర్ నాయకురాలు డాక్టర్ బి.వి.విజయలక్ష్మి, ప్రేంపావని, సిపిఐ హైదరాబాద్ జిల్లా కార్యదర్శి చాయాదేవి, రావినారాయణ రెడ్డి మనవరాలు రావి ప్రతిభ వేదికపైన ఆసీనులయ్యారు. అంతకుముందు హిమాయత్ సత్యనారాయణరెడ్డి భవన్ నుండి మగ్ధుంభవన్ వరకు ‘రెడ్ భారీ కావతు నిర్వహించారు.

వ్యవస్థలను ధ్వంసం చేస్తున్న మోడీ ప్రభుత్వం: నారాయణ
ఈ సభలో డాక్టర్ కె.నారాయణ ప్రసంగిస్తూ దేశంలోని సంస్థాగత వ్యవస్థలను మోడీ ప్రభుత్వం ధ్వంసం చేస్తోందని, ప్రజాస్వామ్యాన్ని ఖునీ చేస్తోందని విమర్శించారు. ప్రతి ఒక్కరి హక్కుల కోసం రాజకీయ పోరాటం చేయాలని, గ్రామీణ, పట్టణాల వరకు కమ్యూనిస్టు పార్టీని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. భారతదేశం కులాలుగా, మతాలుగా, ప్రాంతాలుగా విడిపోకుండా భారత కమ్యూనిస్టు పార్టీ చేసిన త్యాగాలు ఏ రాజకీయ పార్టీ కూడా చేయలేదని, అందుకు తాము స్వాతంత్య్ర ఉద్యమంలో, అనంతరం పంజాబ్, కశ్మీర్, ఈశాన్యరాష్ట్రాలలో అనేక మందిని నాయకులను కోల్పోవల్సి వచ్చిందన్నారు. ‘ఇండియా’ కూటమిని బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తున్నామని, వామపక్షాల భాగస్వామ్యం లేకుండా ‘కూటమి’ బలపడడం సాధ్యం కాదన్నారు. పార్లమెంట్ నాటకీయంగా పొగబాంబు కుట్ర చేసి అందరి దృష్టిని మళ్ళీంచారని, పార్లమెంట్ సమావేశాల్లో దీనిపైన నిరసనకు దిగిన ప్రతిపక్ష ఎంపిలను బయటకు పంపించి, కేంద్రంలోని బిజెపి కోరుకున్న బిల్లలను ఆమోదించుకున్నారని విమర్శించారు. పొగబాంబు ముందస్తు నాటకమన్నారు.దేశాన్ని కాపాడుకోవాలంటే ముందు రాజ్యంగాన్ని కాపాడుకోవాలని, కొందరు ప్రజాస్వామ్యం లేని మోడీ ప్రజాస్వామ్యాన్ని కోరుకుంటున్నారన్నారు. భారత స్వాతంత్య్రం, నిజాం నవాబుకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో ఆర్ బిజెపి పాత్రనే లేదని, అప్పటి బ్రిటీష్ వారికి ఆర్ అనుకూలంగా వ్యవహారించిందని విమర్శించారు. నాటి పోరాటాల్లో ఆర్ బిజెపిలకు చెందిన వారికి ఏ ఒక్క తూట దిగలేదన్నారు.అటువంటి భారతదేశం విడిపోతుంటే ఊరుకుంటామా?, మతం పేరుతో బిజెపి రెచ్చగొడితే ఊరుకుంటామా? అని దుయ్యబట్టారు.